ఈ ఏడాది చివర్లో మానవరహిత గగన్‌యాన్ ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది మనిషినీ అంతరిక్షంలోకి పంపేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను తిరిగి భూమిపై ఎక్కడ ల్యాండింగ్ చేయాలన్న ప్రతిపాదనపై ఇస్రో శాస్త్రవేత్తలు ఓ అవగాహనకు వచ్చి గుజరాత్‌లోని వెరావల్ తీరాన్ని ప్రాథమికంగా ఎంచుకున్నారు.
గగన్‌యాన్ వ్యోమగాముల ల్యాండింగ్ అక్కడేనా!
వచ్చే ఏడాది మానవసహిత గగన్‌యాన్ ప్రయోగానికి ఇస్రో కసరత్తు ముమ్మరం చేసింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను తిరిగి భూమిపై ఎక్కడ ల్యాండింగ్ చేయాలన్న ప్రతిపాదనపై ఇస్రో శాస్త్రవేత్తలు ఓ అవగాహనకు వచ్చారు. ఇందుకోసం గుజరాత్‌లోని వెరావల్ తీరాన్ని ఎంచుకున్నారు.
గగన్‌యాన్ వ్యోమగాముల ల్యాండింగ్ అక్కడేనా!
ఒకవేళ అక్కడ సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయంగా బంగాళాఖాతంలోని మరో తీరాన్ని ఎంపికచేశారు. కచ్చితంగా ఎక్కడ ల్యాండింగ్ చేస్తారన్న విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. ల్యాండ్ అయిన 15-20 నిమిషాలలోపు వ్యోమగాములను క్వారంటైన్ కేంద్రానికి తీసుకెళ్తారు. అక్కడ వారి ఆరోగ్య వివరాలు పరిశీలించి, అంతా బాగుందనుకున్న తర్వాతే ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించనున్నారు.
ఇదీ చూడండి:-గగన్‌యాన్ 'ఫ్లైట్ సర్జన్ల'కు రష్యాలో శిక్షణ