ISRO Deleted Vikram Lander Photos Twitter : చంద్రయాన్ 2 ఆర్బిటార్ తాజాగా తీసిన విక్రమ్ ల్యాండర్ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియా ఎక్స్ (ఇంతకుముందు ట్విట్టర్)లో పోస్టు చేసింది. 'నేను నీపై నిఘా పెడతాను!' అంటూ చంద్రయాన్-2 ఆర్బిటార్ చేసిన వ్యాఖ్యలను ట్వీట్లో ప్రస్తావించింది. 'చంద్రయాన్-2 ఆర్బిటర్.. చంద్రయాన్-3 ల్యాండర్‌ను ఫొటోషూట్ చేసింది. చంద్రయాన్-2 ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా (OHRC).. ప్రస్తుతం చంద్రుడిపై ఉన్న అత్యుత్తమ కెమెరా. 23/2³/23న ల్యాండ్ అయిన తర్వాత చంద్రయాన్-3 ల్యాండర్‌ను గుర్తించింది' అని ఇస్రో రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించి రెండు ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. అయితే పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆ ట్వీట్లను డిలీట్ చేసింది. అయితే, ఇస్రో ఎందుకు ఆ వాటిని డిలీట్ చేసిందో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.
ప్రగ్యాన్ రోవర్ వీడియో విడుదల..
మరోవైపు, విక్రమ్ ల్యాండర్ పొట్టలో నుంచి ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై దిగిన వీడియోను తాజాగా ఇస్రో విడుదల చేసింది. తన బుల్లి కాళ్లతో జారుకుంటూ వెళ్లిన రోవర్ వీడియో ఆకట్టుకుంటోంది.
Chandrayaan 3 Landed on Moon : 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం విక్రమ్ ల్యాండర్ బుధవారం (2023 ఆగస్టు 23) జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. ఇప్పటివరకు అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ మాత్రమే చందమామపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించగా వాటి సరసన భారత్ కూడా చేరింది. అయితే ఏ దేశమూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టడం ఇస్రో ఖ్యాతిని విశ్వవాప్తం చేసింది.