తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దిల్లీ క్యాపిటల్​' బస్సు అద్దాలు ధ్వంసం.. ఐదుగురు అరెస్ట్​

IPL bus Mumbai: ఐపీఎల్​ ఫ్రాంచైజీ దిల్లీ క్యాపిటల్​కు చెందిన బస్సు అద్దాలను మహారాష్ట్ర నవ నిర్మాణ్​ సేన కార్యకర్తలు మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు. ముంబయిలోని తాజ్​హోటల్​ వద్ద పార్కింగ్​ చేసి ఉండగా రాళ్లతో దాడి చేశారు. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

VANDALISM
దిల్లీ క్యాపిటల్​ బస్సు అద్దాలు ధ్వంసం

By

Published : Mar 16, 2022, 4:32 PM IST

IPL bus Mumbai: ఐపీఎల్ క్రీడాకారులను తీసుకెళ్లే బస్సు కాంట్రాక్టును స్థానికులకు ఇవ్వలేదంటూ.. ముంబయిలో మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన(ఎంఎన్​ఎస్​) కార్యకర్తలు.. వీరంగం సృష్టించారు. మంగళవారం రాత్రి ఐపీఎల్​ దిల్లీ క్యాపిటల్​ ఫ్రాంచైజీకి సేవలు అందిస్తున్న బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. తాజ్‌ హోటల్‌ వద్ద పార్కింగ్ చేసిన బస్సుపై ఎంఎన్​ఎస్​ వాహతుక్ సేన కార్యకర్తలు దాడి చేశారు. స్థానికంగా ఉండే నిపుణులకే ఐపీఎల్ రవాణా కాంట్రాక్ట్‌ ఇవ్వాలని కోరినా.. ప్రభుత్వంకానీ, ఐపీఎల్ నిర్వాహకులుగానీ పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఐపీఎల్ క్రీడాకారులు ప్రయాణించే బస్సులను మహారాష్ట్ర వెలుపల నుంచి తీసుకొచ్చారని విమర్శించారు.

బస్సును ధ్వంసం చేస్తున్న దుండగులు

మార్చి 26 నుంచి ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభంకానున్న వేళ.. ఎంఎన్ఎస్​​ చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే పలు జట్లు ముంబయిలోని హోటళ్లలో బస చేస్తున్నాయి.

ఐదుగురు అరెస్ట్​..

ఐపీఎల్​ ఫ్రాంచైజీకి సేవలందిస్తున్న బస్సును ధ్వంసం చేసిన కేసులో మహారాష్ట్ర నవనిర్మాణ్​ సేనకు ట్రాన్స్​పోర్ట్​ విభాగంలోని ఐదుగురు సభ్యులను అరెస్ట్​ చేసినట్లు చెప్పారు పోలీసులు. స్థానికులకు కాకుండా దిల్లీకి చెందిన సంస్థకు కాంట్రాక్టు ఇవ్వటం వల్లే ఇలా చేసినట్లు చెప్పారని తెలిపారు. వారిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.

దిల్లీ క్యాపిటల్​ బస్సు అద్దాలు ధ్వంసం

ఇదీ చూడండి:IPL 2022: మరోసారి సీఎస్​కే కప్పు గెలిచేనా..?

ABOUT THE AUTHOR

...view details