తెలంగాణ

telangana

ETV Bharat / bharat

IOCL Jobs 2023 : ఐటీఐ, డిగ్రీ అర్హతతో.. IOCLలో 1720 అప్రెంటీస్​ జాబ్స్​.. అప్లై చేసుకోండిలా! - ఐఓసీఎల్​లో అప్రెంటీస్ జాబ్స్​

IOCL Jobs 2023 : ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్​లోని రిఫైనరీస్ డివిజన్​లో ఖాళీగా ఉన్న 1720 అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. మరి దీనికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన విద్యార్హతలు, అప్లికేషన్​ లాస్ట్​డేట్​, వయోపరిమితి తదితర వివరాలు మీ కోసం.

IOC Apprentice Jobs 2023
IOCL Jobs 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 11:10 AM IST

IOCL Jobs 2023 : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన ఉద్యోగార్థులకు శుభవార్త వినిపించింది భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్​). రిఫైనరీస్ డివిజన్​లో ఖాళీగా ఉన్న మొత్తం 1720 అప్రెంటీస్‌ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్​ను​ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిఫైనరీల్లో పోస్టులు..
IOCL Recruitment 2023 Notification :

  • గువాహటి రిఫైనరీ
  • బరౌని రిఫైనరీ
  • గుజరాత్​ రిఫైనరీ
  • హల్దియా రిఫైనరీ
  • మధుర రిఫైనరీ
  • దిగ్బోయి రిఫైనరీ
  • బొంగైగావ్​ రిఫైనరీ
  • పారాదీప్ రిఫైనరీ
  • పానిపట్ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్ కాంప్లెక్స్​ రిఫైనరీ

ట్రేడ్ అప్రెంటీస్​ విభాగాలు(IOCL Jobs Trades)

  • అటెండెంట్ ఆపరేటర్​
  • ఫిట్టర్​
  • మెకానికల్​
  • సెక్రటేరియల్ అసిస్టెంట్​
  • అకౌంటెంట్​
  • డేటా ఎంట్రీ ఆపరేటర్

ట్రేడ్ అప్రెంటీస్​ ఉద్యోగాలు-869 పోస్టులు

టెక్నీషియన్ అప్రెంటీస్​ విభాగాలు(IOCL Jobs Trades 2023)..

  • కెమికల్​
  • మెకానికల్​
  • ఎలక్ట్రికల్​
  • ఇన్‌స్ట్రుమెంటేషన్

టెక్నీషియన్ అప్రెంటీస్​ ఉద్యోగాలు-851 పోస్టులు

విద్యార్హతలు..
IOCL Jobs Eligibility :ఆయాపోస్టులను అనుసరించి అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్​మీడియెట్​, సంబంధిత ట్రేడ్‌ లేదా విభాగంలో ఐటీఐ, డిప్లొమా; డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి..
IOCL Jobs Age Limit :2023 అక్టోబర్​ 31 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ
IOCL Jobs Selection Process :అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి.. ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం తేదీ : 2023 అక్టోబర్​ 21
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2023 నవంబర్​ 20
  • అడ్మిట్ కార్డ్ డౌన్​లోడ్​: 2023 నవంబర్​ 27 నుంచి 2023 డిసెంబర్​ 2 వరకు
  • పరీక్ష తేదీ :2023 డిసెంబర్​ 3
  • ఫలితాల వెల్లడి :2023 డిసెంబర్​ 8
  • డాక్యుమెంట్స్​ వెరిఫికేషన్​ :2023 డిసెంబర్​ 13 నుంచి 2023 డిసెంబర్​ 21 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.

అధికారిక వెబ్​సైట్​..
IOCL Official Website :నోటిఫికేషన్​కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఐఓసీఎల్​ అధికారిక​ వెబ్​సైట్​ https://www.ioclapply.com/ను చూడవచ్చు.

UCIL Apprentice Jobs 2023 : ఐటీఐ అర్హతతో.. UCILలో 243 అప్రెంటీస్ పోస్టులు​.. అప్లై చేసుకోండిలా!

Indian Navy Jobs 2023 : డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. ఇండియన్​ నేవీలో 224 ఉద్యోగాలు.. అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?

Assam Rifles Recruitment 2023 : డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. అసోం రైఫిల్స్‌లో 161 టెక్నికల్​, ట్రేడ్స్​మెన్ పోస్టులు.. మహిళలూ అర్హులే!

ABOUT THE AUTHOR

...view details