ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, ఆయన కుమారుడికి దిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. వారిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన అభియోగపత్రాన్నిన్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఏప్రిల్ 7న కోర్టు ముందు హాజరు కావాలని.. జస్టిస్ ఎంకే నాగ్పాల్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది.
ఈడీ తన అభియోగపత్రంలో చిదంబరం, కార్తీ చిదంబరంతో పాటు అకౌంటెంట్ ఎస్ఎస్ భాస్కరన్ సహా పలువురి పేర్లను పేర్కొంది.