Friendship Day 2023 : 'ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాడితో తిరగొద్దని చెప్తే వినవా' అన్న మాట ప్రతి స్నేహితుడు తమ తల్లిదండ్రుల నోట వినే ఉంటారు. మనం ఏం చేస్తాం సరేలే అంటూ మన పని కానిచేస్తాం. ఒక్కోసారి నాన్నకు తెలికుండా మరీ వాడిని కలుస్తాం. పాపం మనం తినే తిట్లలో కూడా వాడికి వాటా పెడతాం. అలా ఉంటది మరీ దోస్తానా అంటే..! ఫ్రెండ్ అంటే కేవలం మంచి, చెడులే కాదు అన్ని పంచుకోవాలి, పంచాలి కూడా అంతే కదా. అలాంటి ఫ్రెండ్స్‌కి ఈ స్నేహితుల రోజున ఏం ఇస్తున్నారు మరీ..?
అన్ని మాటలు పడినా మన వెంటే: స్కూల్ వెళుతున్నప్పటి నుంచి కాలేజీ వరకు మనకు ఫ్రెండ్స్ ఉంటారు అది కామన్. కానీ ఒక్కరుంటారు తినే కంచం నుంచి పడుకునే మంచం వరకు తోడుండే వాడు, సమస్య ఏదీ కానీ నేనున్నాని భుజం తట్టేవాడు, వాడికి సమస్య వస్తే మనల్ని కూడా ఇబ్బందుల్లో నెట్టేసే వాడు, కానీ పొరపాటున ఇంటి దరిదాపుల్లో మనవాళ్లకి వాడితో కనిపించాం అనుకోండి ఇంకా భజన మొదలు పెడతారు. నీ వల్లే వాడు ఇలా తయారవుతున్నాడు. ఇద్దరికి ఇద్దరు సరిపోయారు. అని వాయించేస్తుంటారు. అన్ని మాటలు అన్నా కూడా వాడు మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు చూడు అదే వాడి దగ్గర ఉండే స్పైషాలిటీ.. అలాంటి ఫ్రెండ్స్‌ని ఎందుకు వదులుకుంటాం చెప్పిండి.
వారికిచ్చే గొప్ప బహుమతి: కానీ ఇప్పడి జనరేషన్ పిల్లలు మాత్రం చిన్నపాటి మనస్పర్థలకే వాడు నా ఫ్రెండ్ కాదురా అది ఇది అంటూ అన్ని సంవత్సరాల స్నేహాన్ని మరచిపోతున్నారు. అలా మాట్లాడే ముందు, వాడిని వదిలే ముందు ఇన్నేళ్ల బంధాన్ని మరచిపోతారు. మీరు కూడా ఇలాంటి చిన్నపాటి మిస్టేక్స్‌కి మీ ఫ్రెండ్స్‌తో విడిపోయి ఉంటే వెళ్లి మాట్లాడండి ఇదే మీరు వారికి ఇచ్చే గొప్ప బహుమతి.
స్నేహం పట్ల నిజాయతీగా ఉండండి: ముఖ్యంగా ఒక అమ్మాయి అబ్బాయితో స్నేహం చేస్తే ఇప్పటికాలంలో కూడా తప్పుగా అనుకునే వారు చాలామంది. సింపుల్‌గా ఈ అమ్మాయికి వేరే అమ్మాయి దొరకలేద ఫ్రెండ్షిప్ చేయడానికి అని అనేస్తారు. కానీ అబ్బాయితో స్నేహం చేసే అమ్మాయే వాళ్ల ఫ్రెండ్షిప్లో ఆనందంగా ఉంటుందట..! అమ్మాయిల మధ్య వచ్చే అన్ని మనస్పర్థలు అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్‌కి రావని అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి మీకు మేల్ బెస్టీ ఉంటే అందరు అన్న మాటలు పట్టించుకోకండి మీరు మీ స్నేహం పట్ల నిజాయితిగా ఉండండి. కానీఆ ఫ్రెండ్షిప్ వల్ల తల్లిదండ్రులకు ఎలాంటి అవమానాలు రాకుండా చూసుకోండి.