- కోనసీమ: రావులపాలెంలో చంద్రబాబుపై ఉప్పొంగిన అభిమానం
- రావులపాలెంలో చంద్రబాబుకు ఘనస్వాగతం
- అమలాపురం, కొత్తపేట, ముమ్మడివరం, గన్నవరం, రాజోలు నియోజకవర్గాల నుంచి వేలసంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు
- రాజమండ్రి నుంచి రావులపాలెంకు 30కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 3గంటలకుపైగా సమయం
- గజమాలలు, బాణాసంచా మోతమోగిస్తున్న అభిమానాన్ని చాటుకున్న కార్యకర్తలు
- చంద్రబాబుకు దారిపొడవునా జననీరాజనం, భారీగా రోడ్లపైకి వచ్చిన మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు
Live Updates: రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లి నివాసానికి వెళ్తున్న చంద్రబాబు..రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలుపుతున్న ప్రజలు..18 మంది కార్యకర్తలను పీఎస్‌కు తరలించిన పోలీసులు - Interim bail to Chandrababu in skill case
Published : Oct 31, 2023, 11:05 AM IST
|Updated : Oct 31, 2023, 7:38 PM IST
19:32 October 31
రావులపాలెంలో చంద్రబాబుకు ఘనస్వాగతం
18:59 October 31
18 మంది కార్యకర్తలను పీఎస్‌కు తరలించిన పోలీసులు
- చిలకలూరిపేట: పట్టణ పోలీస్‌స్టేషన్ వద్ద తెదేపా ఆందోళన
- చిలకలూరిపేట: పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన తెదేపా కార్యకర్తలు
- చంద్రబాబు జైలు నుంచి విడుదలైన సందర్భంగా తెదేపా శ్రేణుల ర్యాలీ
- చిలకలూరిపేట: ర్యాలీకి వీల్లేదంటూ అడ్డుకున్న పోలీసులు
- 18 మంది కార్యకర్తలను పీఎస్‌కు తరలించిన పోలీసులు
- చిలకలూరిపేట: పీఎస్‌కు భారీగా వచ్చిన తెదేపా కార్యకర్తలు
- తెదేపా ఆందోళనతో కార్యకర్తలను వదిలిపెట్టిన పోలీసులు
18:30 October 31
రాజమండ్రిలో చంద్రబాబుపై వెల్లువెత్తుతున్న అభిమానం
- రాజమండ్రిలో చంద్రబాబుపై వెల్లువెత్తుతున్న అభిమానం
- రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్న ప్రజలు
- జైలు వద్ద బయలుదేరి 2 గంటలైనా రాజమండ్రి దాటని చంద్రబాబు కాన్వాయ్
- హైకోర్టు ఉత్తర్వులకు లోబడి వ్యవహరిస్తున్న చంద్రబాబు
- కారు లోపల నుంచే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్తున్న చంద్రబాబు
- కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరిన అచ్చెన్నాయుడు
18:17 October 31
సీఐడీ అధికారుల కాల్ డేటాపై చంద్రబాబు వేసిన పిటిషన్ కొట్టివేత
- సీఐడీ అధికారుల కాల్ డేటాపై చంద్రబాబు వేసిన పిటిషన్ కొట్టివేత
- చంద్రబాబు వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన ఏసీబీ కోర్టు
- కాల్ డేటా రికార్డు భద్రపరచాలని గతంలో పిటిషన్ వేసిన చంద్రబాబు
18:08 October 31
చంద్రబాబు వెంట వెళ్తున్న ప్రైవేట్ వాహనాలను అడ్డుకున్న పోలీసులు
- రాజమండ్రి: దివాన్ చెరువు మీదుగా వేమగిరి వైపు చంద్రబాబు కాన్వాయ్
- చంద్రబాబు వెంట వెళ్తున్న ప్రైవేట్ వాహనాలను అడ్డుకున్న పోలీసులు
- పార్టీ నేతల వాహనాలను దివాన్‌చెరువు వద్ద నిలిపివేసిన పోలీసులు
- బారికేడ్లను అడ్డుపెట్టిన పోలీసులపై టీడీపీ నేతల ఆగ్రహం
17:44 October 31
రాజమండ్రి నుంచి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు
- రాజమండ్రి నుంచి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు
- రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లి నివాసానికి వెళ్తున్న చంద్రబాబు
- వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు మీదుగా వెళ్తున్న చంద్రబాబు
- తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు మీదుగా వెళ్తున్న చంద్రబాబు
- హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ మీదుగా వెళ్తున్న చంద్రబాబు
- చంద్రబాబును చూసేందుకు దారిపొడవునా బారులుతీరిన కార్యకర్తలు, అభిమానులు
- అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న చంద్రబాబు
17:15 October 31
రాజమండ్రి ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను: భువనేశ్వరి
- 53 రోజులపాటు ఎంతో వేదన చెందా: నారా భువనేశ్వరి
- తట్టుకోలేనంత బాధతో క్షణమొక యుగంలా గడిచింది: భువనేశ్వరి
- తెలుగుజాతి ఇచ్చిన మద్దతు ఊరట ఇచ్చింది: భువనేశ్వరి
- మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి మద్దతిచ్చారు: భువనేశ్వరి
- రాజమండ్రి ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను: భువనేశ్వరి
- దేవుడి దయతో రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలి: భువనేశ్వరి
17:06 October 31
రాజమండ్రి జైలు నుంచి అమరావతి బయలుదేరిన చంద్రబాబు
- రాజమండ్రి జైలు నుంచి అమరావతి బయలుదేరిన చంద్రబాబు
- చంద్రబాబు వెంట కుటుంబసభ్యులు, తెదేపా నేతలు
- దారిపొడవునా చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న అభిమానులు
17:00 October 31
నా విధానాలతో లబ్ధి పొందినవారు సంఘీభావం తెలిపారు: చంద్రబాబు
- 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు: చంద్రబాబు
- నా విధానాలతో లబ్ధి పొందినవారు సంఘీభావం తెలిపారు: చంద్రబాబు
- ఐటీ ఉద్యోగులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు: చంద్రబాబు
16:52 October 31
నేను ఏ తప్పూ చేయలేదు.. చేయనీయను..: చంద్రబాబు
- కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ మద్దతు తెలిపారు: చంద్రబాబు
- రోడ్లపైకి వచ్చి అందరూ సంఘీభావం తెలిపారు: చంద్రబాబు
- మీ అభిమానాన్ని జీవితంలో మరిచిపోను: చంద్రబాబు
- దేశ, విదేశాల్లోనూ సంఘీభావం తెలిపారు: చంద్రబాబు
- మీ అభిమానంతో నా జన్మ ధన్యమైంది: చంద్రబాబు
- నేను ఏ తప్పూ చేయలేదు.. చేయనీయను..: చంద్రబాబు
- నాకు అన్ని పార్టీలు సంఘీభావం తెలిపాయి: చంద్రబాబు
- సంఘీభావం తెలిపిన పార్టీలకు ధన్యవాదాలు: చంద్రబాబు
- ప్రత్యేకంగా జనసేన పూర్తిగా సహకరించింది: చంద్రబాబు
- పవన్ కల్యాణ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు: చంద్రబాబు
- భాజపా, వామపక్షాలు, భారాసకు ధన్యవాదాలు: చంద్రబాబు
- మీ అభిమానంతో నా జన్మ ధన్యమైంది: చంద్రబాబు
- నేను చేసిన అభివృద్ధిని అందరూ గుర్తుచేసుకున్నారు: చంద్రబాబు
16:44 October 31
నేను చేసిన అభివృద్ధిని 52 రోజులూ గుర్తు చేసుకున్నారు: చంద్రబాబు
- మీ అభిమానంతో నా జన్మ ధన్యమైంది: చంద్రబాబు
- నేను చేసిన అభివృద్ధిని 52 రోజులూ గుర్తు చేసుకున్నారు: చంద్రబాబు
16:38 October 31
మీరు చూపించిన అభిమానాన్ని జీవితంలో ఎప్పుడూ మరిచిపోను: చంద్రబాబు
- తెలుగు ప్రజలు అందరికీ నమస్కారాలు: చంద్రబాబు
- కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ మద్దతు తెలిపారు: చంద్రబాబు
- రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారు.. పూజలు చేశారు..: చంద్రబాబు
- మీరు చూపించిన అభిమానాన్ని జీవితంలో ఎప్పుడూ మరిచిపోను: చంద్రబాబు
- తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ, విదేశాల్లోనూ సంఘీభావం ప్రకటించారు: చంద్రబాబు
- నేను చేపట్టిన విధానాల వల్ల లబ్ధి పొందినవారంతా మద్దతిచ్చారు: చంద్రబాబు
- 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు: చంద్రబాబు
- నాకు మద్దతుగా నిలిచిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు: చంద్రబాబు
- నాకు అండగా నిలిచిన వివిధ పార్టీల నేతలకు ధన్యవాదాలు: చంద్రబాబు
- సంఘీభావం తెలిపిన పవన్ కల్యాణ్‌కు మనఃస్ఫూర్తిగా అభినందనలు: చంద్రబాబు
- సంఘీభావం తెలిపిన తెదేపా కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు: చంద్రబాబు
- హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు కూడా మొన్న సంఘీభావం తెలిపారు: చంద్రబాబు
16:16 October 31
రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల
- రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల
- 52 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు
- చంద్రబాబును ఆలింగనం చేసుకున్న తెదేపా నేతలు
- చంద్రబాబును చూసి భావోద్వేగానికి గురైన తెదేపా అభిమానులు
- చంద్రబాబుకు స్వాగతం చెబుతూ అభిమానుల నినాదాలు
- జై చంద్రబాబు.. నినాదాలతో హోరెత్తుతున్న జైలు పరిసరాలు
- అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు నడుస్తున్న చంద్రబాబు
- జనసంద్రంగా మారిన రాజమండ్రి జైలు పరిసరాలు
16:14 October 31
చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై షరతులు విధించిన హైకోర్టు
- చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై షరతులు విధించిన హైకోర్టు
- ర్యాలీలో పాల్గొనవద్దని చంద్రబాబుకు షరతులు విధించిన హైకోర్టు
- స్కిల్ కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని హైకోర్టు షరతులు
- స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్‌పై నిబంధనలు పెంచాలని సీఐడీ మెమో
- సీఐడీ మెమో పిటిషన్‌పై విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు
16:10 October 31
ములాఖత్‌లో చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన లోకేష్, బ్రాహ్మణి
- ములాఖత్‌లో చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన లోకేష్, బ్రాహ్మణి
- జై చంద్రబాబు.. నినాదాలతో హోరెత్తుతున్న జైలు పరిసరాలు
16:06 October 31
ఇవాళ నిజాయతీ, న్యాయవ్యవస్థ గెలిచింది: నందమూరి రామకృష్ణ
- ఇవాళ నిజాయతీ, న్యాయవ్యవస్థ గెలిచింది: నందమూరి రామకృష్ణ
- చంద్రబాబు బయటకు రావడం చాలా ఆనందంగా ఉంది:నందమూరి రామకృష్ణ
16:06 October 31
జైలు వద్దకు రాకుండా తెదేపా కార్యకర్తలను అడ్డుకోవడం సరికాదు: తెదేపా నేతలు
- బెయిల్ మీద బయటకు వచ్చేటప్పుడు కూడా ఆంక్షలు ఎందుకు?: తెదేపా నేతలు
- జైలుకు 3 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు పెట్టడం దారుణం: తెదేపా నేతలు
- జైలు వద్దకు రాకుండా తెదేపా కార్యకర్తలను అడ్డుకోవడం సరికాదు: తెదేపా నేతలు
- అభిమాన నేతను చూసేందుకు వేలమంది తరలివస్తున్నారు: తెదేపా నేతలు
- రాజమండ్రిలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు: అచ్చెన్నాయుడు
15:57 October 31
రాజమండ్రి జైలు వద్దకు చేరుకున్న నందమూరి బాలకృష్ణ
- రాజమండ్రి జైలు వద్దకు చేరుకున్న నందమూరి బాలకృష్ణ
15:46 October 31
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దృష్ట్యా రాజమండ్రిలో కోలాహలం
- చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దృష్ట్యా రాజమండ్రిలో ఉద్వేగ వాతావరణం
- జైలు వద్దకు భారీగా తరలివచ్చిన చంద్రబాబు అభిమానులు, తెదేపా కార్యకర్తలు
- పోలీసు బారికేడ్లు తోసుకుని జైలు వద్దకు వచ్చిన తెదేపా అభిమానులు
- 52 రోజులుగా చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాల్లో వెల్లువెత్తిన సంఘీభావం
- రాష్ట్రం నలుమూలల నుంచి రాజమండ్రికి తరలివస్తున్న తెదేపా అభిమానులు
- చంద్రబాబును చూసేందుకు తెలంగాణ నుంచీ రాజమండ్రి వచ్చిన అభిమానులు
- రాజమండ్రి జైలు వద్దకు వచ్చే అన్ని మార్గాల్లోనూ భారీగా జనసందోహం
15:40 October 31
రాజమండ్రి జైలు వద్ద పరిసరాలు పరిశీలించిన ఎన్‌ఎస్‌జీ భద్రతా సిబ్బంది
- రాజమండ్రి జైలు వద్ద పరిసరాలు పరిశీలించిన ఎన్‌ఎస్‌జీ భద్రతా సిబ్బంది
- రాజమండ్రి జైలు వద్దకు భారీగా చేరుకున్న తెదేపా శ్రేణులు, నినాదాలు
15:29 October 31
స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్‌పై నిబంధనలు పెంచాలని సీఐడీ మెమో
- స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్‌పై నిబంధనలు పెంచాలని సీఐడీ మెమో
- హైకోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ అధికారులు
- చంద్రబాబు.. రాజకీయ ర్యాలీలు, ప్రసంగాలు చేయకూడదని మెమో దాఖలు
- చంద్రబాబు.. మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన సీఐడీ
15:09 October 31
రేపు కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళ్లనున్న చంద్రబాబు
- రేపు కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళ్లనున్న చంద్రబాబు
- ఎల్లుండి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
- తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు
14:54 October 31
చంద్రబాబుతో ములాఖత్ కోసం జైలుకు వచ్చిన లోకేశ్, బ్రాహ్మణి
- రాజమండ్రికి చంద్రబాబుతో ములాఖత్ కోసం జైలుకు వచ్చిన లోకేశ్, బ్రాహ్మణి
- ములాఖత్ కోసం జైలుకు వచ్చిన ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి
14:50 October 31
అనారోగ్య కారణాలతో బెయిల్ ఇచ్చినందున మద్యం కేసులో అరెస్టు చేయబోమన్న సీఐడీ
- అనారోగ్య కారణాలతో బెయిల్ ఇచ్చినందున మద్యం కేసులో అరెస్టు చేయబోమన్న సీఐడీ
- మధ్యంతర బెయిల్ గడువు ముగిసేవరకు అరెస్టు చేయబోమని కోర్టుకు తెలిపిన సీఐడీ
- హైకోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన అడ్వకేట్ జనరల్
- మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు అత్యవసర పిటిషన్
- చంద్రబాబు అత్యవసర పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు
14:45 October 31
రాజమండ్రి జైలు పరిసరాల్లో పోలీసుల ఆంక్షలు
- రాజమండ్రి జైలు పరిసరాల్లో పోలీసుల ఆంక్షలు
- రాజమండ్రి వై జంక్షన్ నుంచి ప్రభుత్వాస్పత్రి వరకు బారికేడ్లు ఏర్పాటు
14:08 October 31
కోర్టుకు షూరిటీలు సమర్పించిన దేవినేని ఉమ, బొండా ఉమ
- కోర్టుకు షూరిటీలు సమర్పించిన దేవినేని ఉమ, బొండా ఉమ
- రూ.లక్ష పూచీకత్తు చొప్పున సమర్పించిన తెదేపా నేతలు
- బెయిల్ ఆర్డర్, అఫిడవిట్లను ఏసీబీ కోర్టుకు సమర్పించిన చంద్రబాబు తరఫు లాయర్లు
- తదుపరి ఆదేశాలను జైలు అధికారులకు మెయిల్ ద్వారా పంపుతామన్న ఏసీబీ కోర్టు
13:29 October 31
53 రోజులుగా రాజమహేంద్రవరంలోనే చంద్రబాబు కాన్వాయ్
- రాజమహేంద్రవరంలోనే ఉన్న చంద్రబాబు కాన్వాయ్
- 53 రోజులుగా రాజమండ్రిలోనే ఉన్న చంద్రబాబు ఎన్ఎస్‌జీ భద్రతాదళం
- జైలు బయట అందుబాటులో ఎన్ఎస్‌జీ సెక్యూరిటీ, చంద్రబాబు కాన్వాయ్
13:29 October 31
- మధ్యంతర బెయిల్ వస్తుందనే మద్యం కేసు పెట్టారు: సోమిరెడ్డి
- చంద్రబాబుపై ఒక్క తప్పు కూడా చూపించలేకపోయారు: సోమిరెడ్డి
13:28 October 31
న్యాయం గెలిచింది.. బెయిల్ రావడం సంతోషం: భువనేశ్వరి
- న్యాయం గెలిచింది.. బెయిల్ రావడం సంతోషం: భువనేశ్వరి
- ఈ గెలుపు రాష్ట్ర ప్రజలందరిది: నారా భువనేశ్వరి
- న్యాయం కోసం పోరాడిన అందరికీ ధన్యవాదాలు: భువనేశ్వరి
13:19 October 31
సీఐడీ అధికారులు మనీ ట్రయల్ జరిగిందని నిరూపించలేకపోయారు: కనకమేడల
- చంద్రబాబును అరెస్టు చేసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు: కనకమేడల
- స్కిల్ కేసులో చంద్రబాబుపై ప్రభుత్వ పరంగా, సీఐడీ పరంగా ఆరోపణలు లేవు: కనకమేడల
- రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరిని అవలంబిస్తుంది: కనకమేడల
- సీఐడీ, పోలీసులను వైకాపా అనుబంధ సంస్థగా మార్చారు: కనకమేడల
- చంద్రబాబుపై వ్యక్తిగత కక్ష లేకపోతే దిల్లీలో ఎందుకు మీడియా సమావేశం పెట్టారు?: కనకమేడల
- సీఐడీ అధికారులు మనీ ట్రయల్ జరిగిందని నిరూపించలేకపోయారు: కనకమేడల
- డబ్బులు మారినట్లు జరిగిందా అని కోర్టు అడిగితే.. విచారించి వివరాలు సేకరిస్తామన్నారు: కనకమేడల
- ప్రభుత్వ సలహాదారులు సాక్ష్యాధారాలు సేకరించి చంద్రబాబును అరెస్టు చేశామని చెబుతున్నారు: కనకమేడల
- సీఐడీ అధికారులు మాత్రం విచారించి వివరాలు సేకరిస్తామంటున్నారు: కనకమేడల
13:18 October 31
- చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషకరం: ఎంపీ రామ్మోహన్
- చంద్రబాబును ప్రజలకు దూరం చేయాలనే జైలులో పెట్టారు: ఎంపీ రామ్మోహన్
- మెడికల్ రిపోర్టును కూడా తారుమారు చేశారు: ఎంపీ రామ్మోహన్
- రేపటి భువనేశ్వరి శ్రీకాకుళం పర్యటన వాయిదా: ఎంపీ రామ్మోహన్
- భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెడతాం: ఎంపీ రామ్మోహన్ నాయుడు
13:18 October 31
- చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ షూరిటీలు సమర్పించిన తెదేపా
- షూరిటీలు సమర్పించిన బోండా ఉమ, దేవినేని ఉమ
12:38 October 31
చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం: పవన్‌కల్యాణ్
- చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం: పవన్‌కల్యాణ్
- సంపూర్ణ ఆరోగ్యం, ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలి: పవన్‌కల్యాణ్
- చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం: పవన్‌కల్యాణ్
- చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు: పవన్
12:26 October 31
ధర్మాన్ని ఎంతోకాలం కటకటాల వెనుక దాచలేరు: ఎన్.విజయ్‌కుమార్
- న్యాయం గెలిచింది: తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్
- ధర్మాన్ని ఎంతోకాలం కటకటాల వెనుక దాచలేరు: ఎన్.విజయ్‌కుమార్
- చంద్రబాబును 50 రోజులు కష్టపెట్టారేమో: నీలాయపాలెం విజయ్‌కుమార్
- న్యాయం చంద్రబాబు వైపు ఉందని స్పష్టమైంది: ఎన్.విజయ్‌కుమార్
12:26 October 31
- న్యాయం గెలిచింది: తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్
- ధర్మాన్ని ఎంతోకాలం కటకటాల వెనుక దాచలేరు: ఎన్.విజయ్‌కుమార్
- చంద్రబాబును 50 రోజులు కష్టపెట్టారేమో: నీలాయపాలెం విజయ్‌కుమార్
- న్యాయం చంద్రబాబు వైపు ఉందని స్పష్టమైంది: ఎన్.విజయ్‌కుమార్
12:12 October 31
- బాపట్ల జిల్లా: ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది: గొట్టిపాటి రవికుమార్
- సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబుకు న్యాయం జరుగుతుంది: గొట్టిపాటి
12:09 October 31
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం పట్ల సంబరాలు
- హైదరాబాద్: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం పట్ల సంబరాలు
- ఎన్టీఆర్ భవన్ ఎదుట బాణాసంచా కాలుస్తూ తెదేపా కార్యకర్తల సంబరాలు
- చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెదేపా నాయకులు
12:08 October 31
- చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాం.. బెయిల్ రావడం సంతోషం: జూలకంటి
- చంద్రబాబుకు బెయిల్‌తో వైకాపా కుట్రలకు అడ్డుకట్ట పడింది: జూలకంటి బ్రహ్మారెడ్డి
12:08 October 31
చంద్రబాబుకు మధ్యంతరం బెయిల్ రావడం మంచి పరిణామం: పురందేశ్వరి
- చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నాం: పురందేశ్వరి
- చంద్రబాబును అరెస్టు తీరును మేము తప్పుపట్టాం: పురందేశ్వరి
- నోటీసులు, విచారణ లేకుండా అరెస్టును గతంలోనే తప్పుపట్టాం: పురందేశ్వరి
- ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే అరెస్టు చేసిన తీరు కూడా సరికాదు: పురందేశ్వరి
- చంద్రబాబుకు మధ్యంతరం బెయిల్ రావడం మంచి పరిణామం: పురందేశ్వరి
12:08 October 31
- ఆలస్యమైనా న్యాయం తప్పకుండా గెలుస్తుంది: ఉండవల్లి శ్రీదేవి
- వైకాపాకు స్కిల్ డెవలప్‌మెంట్ అర్థం తెలియదు: ఉండవల్లి శ్రీదేవి
12:08 October 31
"చంద్రబాబుకు బెయిల్ రావడం చాలా సంతోషం"
- చంద్రబాబుకు బెయిల్ రావడం చాలా సంతోషం: కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్
- వేరే కేసుల్లో మళ్లీ అరెస్టు చేస్తారేమోనన్న అనుమానాలున్నాయి: చింతా మోహన్
- ఎలాంటి అడ్డంకులు లేకుండా చంద్రబాబును బయటకు పంపించాలి: చింతా మోహన్
12:04 October 31
చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం: యరపతినేని
- చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం: యరపతినేని
- మళ్లీ ఇప్పుడు చంద్రబాబుపై మద్యం కేసు పెట్టారు: యరపతినేని
- చంద్రబాబుపై తప్పుడు కేసులు నిలబడవు: యరపతినేని శ్రీనివాసరావు
- జనసేన, తెదేపా కూటమి గెలవనుంది: యరపతినేని శ్రీనివాసరావు
- చంద్రబాబును పెట్టిన జైలులోనే జగన్‌ను ఉంచుతాం: యరపతినేని
11:44 October 31
మధ్యంతర బెయిల్ మంజూరుపై హైకోర్టు విధించిన షరతులు
- చంద్రబాబుకు షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు
- రూ.లక్ష చొప్పున పూచీకత్తు, ఇద్దరు షూరిటీలు సమర్పించాలి: హైకోర్టు
- తనకు నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో చికిత్స పొందాలి: హైకోర్టు
- చికిత్స, ఆస్పత్రి వివరాలు జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలి: హైకోర్టు
- సరెండర్ అయ్యే సమయంలో సీల్డ్ కవర్‌లో సమర్పించాలి: హైకోర్టు
- ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసును ప్రభావితం చేయరాదు: హైకోర్టు
- నవంబర్ 28 సాయంత్రం 5లోగా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ వద్ద సరెండర్ కావాలి: హైకోర్టు
11:12 October 31
హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి లోకేశ్, బ్రాహ్మణి
- హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన లోకేష్, బ్రాహ్మణి
- రాజమహేంద్రవరం తెదేపా కార్యాలయానికి వచ్చిన లోకేష్
- జైలు నుంచి ఎయిర్‌పోర్టు వరకు సాయంత్రం భారీ ర్యాలీ
11:08 October 31
మిగతా కేసుల్లో కూడా మధ్యంతర బెయిల్
- పెండింగ్‌లో ఉన్న మిగతా కేసుల్లో కూడా మధ్యంతర బెయిల్
- ఉత్తర్వుల వల్ల బయటికి రావడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు
- ఇన్నర్ రింగ్‌రోడ్డులో సీఐడీ పీటీ వారెంట్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది
- ఫైబర్‌నెట్ కేసుపై సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది
- ఆరోగ్య సమస్యలపై బయటకు వస్తున్నందున తాజాగా పెట్టిన మద్యం కేసులోనూ ఇబ్బంది లేదు
- మెరుగైన వైద్యం కోసం సొంత ఖర్చులతో వైద్యానికి ఆదేశాలు కూడా వచ్చాయి
11:03 October 31
మద్యం కేసులో ముందస్తు బెయిల్‌కు చంద్రబాబు అత్యవసర పిటిషన్
- మద్యం కేసులో ముందస్తు బెయిల్‌కు చంద్రబాబు అత్యవసర పిటిషన్
- చంద్రబాబు అత్యవసర పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు
- చంద్రబాబు అత్యవసర పిటిషన్‌పై మధ్యాహ్నం వాదనలు జరిగే అవకాశం
- మద్యం కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చిన సీఐడీ
11:03 October 31
సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్టు
- సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్టు
- 52 రోజులుగా రాజమండ్రి జైలులో చంద్రబాబు
- అనారోగ్య కారణాలరీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరుకు పిటిషన్
- చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు
- రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో మధ్యంతర బెయిల్ మంజూరు
10:54 October 31
Live Updates: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
- చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- నాలుగు వారాలపాటు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
- నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు
- ప్రధాన బెయిల్‌పై నవంబర్ 10న హైకోర్టులో విచారణ
- సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్టు
- 52 రోజులుగా రాజమండ్రి జైలులో చంద్రబాబు
- అనారోగ్య కారణాలరీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరుకు పిటిషన్
- చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు
TAGGED:
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్