తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాగు చట్టాలను నిరసిస్తూ ఎమ్మెల్యే రాజీనామా

కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత జాతీయ లోక్​దళ్ నాయకుడు అభయ్ సింగ్ చౌతాలా బుధవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ట్రాక్టర్​పై వెళ్లి స్పీకర్​కు రాజీనామా లేఖ అందించారు. దాన్ని స్పీకర్ ఆమోదించారు.

abhay singh chautala resign
సాగు చట్టాలను నిరసిస్తూ ఎమ్మెల్యే రాజీనామా

By

Published : Jan 28, 2021, 5:18 AM IST

కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. హరియాణాలో ఓ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. భారత జాతీయ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే అభయ్​సింగ్ చౌతాలా తన రాజీనామా లేఖను రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ జ్ఞాన్‌ సింగ్‌ గుప్తాకు అందజేశారు. చౌతాలా తన అనుచరులతో కలిసి ట్రాక్టర్‌పై విధానసభకు వచ్చి స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. సాగు చట్టాలను సమర్థిస్తూ తీర్మానం చేయదలచుకున్న శాసనసభలో కూర్చోలేనని చౌతాలా పేర్కన్నారు.

కాగా ఆయన రాజీనామాను స్పీకర్‌ గుప్తా ఆమోదించినట్టు స్పీకర్‌ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

"ఎల్లానాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న అభయ్‌ సింగ్‌ చౌతాలా కొద్ది సేపటి క్రితం తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన నాకు ఇచ్చిన రాజీనామా లేఖలోని అంశాలు అన్ని విధాలుగా సరైన పద్ధతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన రాజీనామాను ఆమోదించాం. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకునేందుకు నిరాకరిస్తున్నందునే తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వెల్లడించారు."

-స్పీకర్‌ కార్యాలయం

ఈ సందర్భంగా చౌతాలా మీడియాతో మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనపై భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే సాగు చట్టాల రద్దు కోసం గత నెలలో స్పీకర్‌కు చౌతాలా లేఖ రాయగా.. ఆయన తండ్రి, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా ప్రధాని మోదీకి లేఖ రాశారు.

ABOUT THE AUTHOR

...view details