దేశంలో కొవిడ్(Covid cases in India) ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. వరుసగా మూడో రోజూ 2 లక్షల దిగువన కరోనా కేసులు (covid cases) నమోదయ్యాయి. కొత్తగా 1,65,553 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3,460 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు:2,78,94,800
- మొత్తం మరణాలు:3,25,972
- కోలుకున్నవారు:2,54,54,320
- యాక్టివ్ కేసులు:21,14,508
ఇదీ చదవండి:Covid-19: కరోనాను జయించిన వందేళ్ల దంపతులు
34.11 కోట్ల పరీక్షలు..
దేశవ్యాప్తంగా శనివారం 20,63,839 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 34,31,83,748కి చేరినట్లు చెప్పింది.