తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈడీ విచారణకు హాజరైన అనిల్​ అంబానీ.. ఆ కేసులోనే! - ఈడీ ఎదుట హాజరైన అనిల్ అంబానీ

Anil Ambani ED Case : ప్రముఖ వ్యాపారవేత్త అనిల్​ అంబానీ.. ఫెమా కేసు విచారణ కోసం ఈడీ ఎదుట హాజరయ్యారు. ముంబయిలో ఈడీ అధికారులు అనిల్ అంబానీని ప్రశ్నించారు.

Industrialist Anil Ambani
Industrialist Anil Ambani

By

Published : Jul 3, 2023, 4:00 PM IST

Updated : Jul 3, 2023, 7:19 PM IST

Anil Ambani ED Case : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్​ ఏడీఏ గ్రూప్ ఛైర్మన్​ అనిల్​ అంబానీ.. ఫెమా కేసు విచారణ కోసం సోమవారం ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్- ఈడీ ఎదుట హాజరయ్యారు. విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో ముంబయిలో ఈడీ అధికారులు అనిల్ అంబానీని ప్రశ్నించారు. విచారణలో భాగంగా ఈడీ అధికారులు అనిల్‌ అంబానీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. 'వ్యాపారవేత్త అనిల్ అంబానీని.. ఫెమా కేసు విచారణలో భాగంగా ప్రశ్నించాం. ఆయన స్టేట్​మెంట్​ను రికార్డు చేశాం' అని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. కాగా.. ఏ కేసులో అనిల్ అంబానీని విచారించనేది మాత్రం అధికారులు తెలపలేదు.

అనిల్ అంబానీకి నోటీసులు..
రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో రూ. 814 కోట్లకు పైగా వెల్లడించని నిధులపై రూ.420 కోట్ల పన్నులు ఎగవేసిన ఆరోపణలపై 2022 ఆగస్టులో ఐటీ శాఖ.. అనిల్​ అంబానీకి నల్లధన నిరోధక చట్టం కింద నోటీసు జారీ చేసింది. అయితే బాంబే హైకోర్టు.. ఈ ఏడాది మార్చిలో ఐటీ శాఖ షోకాజ్​ నోటీసులు, పెనాల్టీ డిమాండ్​పై మధ్యంతర స్టే విధించింది.

మనీలాండరింగ్ కేసులో..
అంతకుముందు 2020లో ఎస్​ ​బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్​కు సంబంధించి మనీలాండరింగ్​ కేసులో వ్యాపారవేత్త అనిల్​ అంబానీని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించింది. బల్లార్డ్​ ఎస్టేట్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న అంబానీని ఈడీ అధికారులు ప్రశ్నించి.. స్టేట్​మెంట్​ను రికార్డు చేసుకున్నారు. మనీలాండరింగ్​ నిరోధక చట్టం (పీఎంఎల్​ఏ) కింద అంబానీ వద్ద వాంగ్మూలం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఎస్​ బ్యాంకు నుంచి రిలయన్స్ గ్రూపు సంస్థలు సుమారు రూ.12,800 కోట్ల రుణాలను పొందాయి. సకాలంలో చెల్లించని కారణంగా అవి నిరర్ధక ఆస్తుల జాబితాలోకి చేరాయి. ఈ నేపథ్యంలోనే అనిల్ అంబానీని ఈడీ అధికారులు విచారించారు.

మైదానం బంద్​..
కొవిడ్ సమయంలో మహారాష్ట్ర మహాబలేశ్వర్​లోని ఓ గోల్ఫ్​ మైదానంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్​ గ్రూపు ఛైర్మన్​ అనిల్​ అంబానీ తన కుటుంబంతో కలిసి సాయంత్రం వాకింగ్ చేస్తున్న వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారగా అధికారులు స్పందించారు. ఆ గోల్ఫ్​ కోర్స్​ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎందుకో తెలుసా? అయితే పూర్తి వార్త కోసం ఈ లింక్​పై క్లిక్ చెయ్యండి.

Last Updated : Jul 3, 2023, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details