తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఒప్పందానికి అనుగుణంగానే ప్రాజెక్టుల నిర్వహణ' - Pak seeks information

సింధు నదీ జలాల ఒప్పందంపై భారత్​-పాకిస్థాన్​ మధ్య జరిగిన సమావేశంలో.. దాయాది అభ్యంతరాలను భారత్​ తిరస్కరించింది. ప్రాజెక్టుల నిర్వహణపై స్పష్టత ఇచ్చింది. ఒప్పందానికి అనుగుణంగానే ప్రాజెక్టు నిర్వహణ జరుగుతుందని తెలిపింది.

Pak seeks information on other planned hydro projects
'ఒప్పందానికి అనుగుణంగానే ప్రాజెక్టుల నిర్వహణ'

By

Published : Mar 25, 2021, 8:35 AM IST

సింధు నదీ జలాల ఒప్పందంపై భారత్‌- పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న రెండురోజుల సమావేశాలు ముగిశాయి. జమ్ముకశ్మీర్‌లో భారత్‌ నిర్మిస్తున్న జల విద్యుత్‌ ప్రాజెక్టులపై, లద్దాఖ్‌లోని ఓ ప్రాజెక్టుపై ఈ సమావేశాల సందర్భంగా పాక్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీటిపై భారత్‌ కూడా తన వాదనలు వినిపించించింది.

జమ్ముకశ్మీర్​లోని పకల్ దుల్(1000 మెగా వాట్), లోవర్ కల్మయ్(48 మెగా వాట్) జలవిద్యుదుత్పత్తి కేంద్రాల డిజైన్​లు సింధు నదీ జలాల ఒప్పందానికి అనుగుణంగానే ఉన్నాయని పాక్​కు స్పష్టత ఇచ్చింది భారత్. లద్ధాఖ్​లో చేపట్టనున్న ప్రాజెక్టుల నిర్వహణపైనా వివరణ ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

చివరిసారిగా ఈ సమావేశాలు 2018లో లాహోర్‌లో జరిగాయి. గత నెల భారత్‌- పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఈ సమావేశాలకు భారత్‌ ఆతిథ్యమివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి:నాపై దర్యాప్తు చేపట్టండి: దేశ్​ముఖ్

ABOUT THE AUTHOR

...view details