తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇండిగో విమానానికి తప్పిన 'మంచు ముప్పు' - విమానాల రాకపోకలు

శ్రీనగర్ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి ముప్పు తప్పింది. రన్​వే పక్కనున్న మంచుకు విమానం అతి దగ్గరగా వెళ్లిన ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

Indigo aircraft survives snow crash at Srinagar Airport
ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

By

Published : Jan 13, 2021, 7:09 PM IST

శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ముప్పు తప్పింది. ల్యాండింగ్​ సమయంలో ప్రమాదవశాత్తూ రన్​వే పక్కన పేరుకుపోయిన మంచుకు అతి దగ్గరగా విమానం దూసుకెళ్లింది. అప్రమత్తమైన పైలట్లు... వెంటనే విమానాన్ని నిలిపేశారు.

రన్​వే పక్కన పేరుకుపోయిన మంచు..

ప్రమాదంలో విమాన ఇంజన్, బ్లేడ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రయాణికులను సురక్షితంగా తరలించాం.

-శ్రీనగర్ విమానాశ్రయ డైరెక్టర్​

ప్రమాదం కారణంగా శ్రీనగర్​ విమానాశ్రయానికి విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

పాక్షికంగా మంచులో చిక్కుకున్న విమానం..
దెబ్బతిన్న బ్లేడ్లు..

ఇదీ చదవండి:పాక్​ సరిహద్దులో మరో సొరంగం

ABOUT THE AUTHOR

...view details