వ్యాక్సినేషన్(vaccination) ప్రక్రియలో భాగంగా 30 కోట్ల డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 7.02 కోట్ల మంది తొలిడోసు తీసుకోగా.. 14.98 లక్షల మంది రెండో డోసు తీసుకున్నట్లు పేర్కొంది.
అసోం, బిహార్, గుజరాత్, హరియాణా, కేరళ సహా మరో 13 రాష్ట్రాలకు చెందిన 18-44 ఏళ్ల వయసు వారిలో 10 లక్షలపైగా జనాభాకు తొలి డోసు అందించామని తెలిపింది.