దేశంలో రెండో దశలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి రానున్న రోజుల్లో మరింత ఉగ్రరూపం దాల్చుతుందని పరిశోధకులు తెలిపారు. వచ్చేనెల 11-15 తేదీల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 33 నుంచి 35 లక్షల గరిష్ఠ స్థాయికి చేరుతుందని గణితశాస్త్ర లెక్కల ప్రకారం ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే.. మే చివరి నాటికి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలిపారు.
ఈ నెల 25-30 నాటికి దిల్లీ, హరియాణా, రాజస్థాన్, తెలంగాణాలో కొత్త కేసులు అధికంగా ఉండొచ్చని పరిశోధకులు వివరించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో ఇప్పటికే కొత్త కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్టు వారు చెప్పారు.
ఇదీ చదవండి:దేశంలో మరో 3.32 లక్షల మందికి కరోనా
గణిత మోడలింగ్ విధానం ప్రకారం.. ఏప్రిల్ 15 నాటికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య గరిష్ఠస్థాయికి పెరుగుతుందని ఈ నెలారంభంలో అంచనా వేశారు. కానీ.. అంచనాలు నిజం కాలేదు. ప్రస్తుత దశలో తమ నమూనాలో పారామితులు నిరంతరం మార్పులు చెందుతున్నాయని, అందువల్ల అంచనా విలువను పక్కాగా లెక్కించడం కష్టతరమవుతుందని నిపుణులు వివరించారు. ఒక్కరోజులో నమోదయ్యే కేసుల్లో స్వల్ప తేడా వల్ల గరిష్ఠ కేసుల సంఖ్యల్లో వేలల్లో మార్పులుంటాయని చెప్పారు.
అశోక విశ్వవిద్యాలయం అంచనా..
హరియాణాలోని అశోక విశ్వవిద్యాలయంలోని గౌతమ్ మేనన్, ఆయన బృందం చేసిన పరిశోధనల ప్రకారం.. ఏప్రిల్ మధ్య నుంచి మే మధ్యకాలంలో వైరస్ కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయిలో ఉంటుందని తెలిసింది.
ఇదీ చదవండి:ఆక్సిజన్ కొరతపై సుప్రీం సీరియస్