దేశ ప్రజల సగటు ఆయుర్ధాయం 2031నుంచి 2035 నాటికి 72 ఏళ్లకు చేరుకోనుందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అంచనా వేసింది. సగటు ఆయుర్ధాయం మహిళల్లో అత్యధికంగా 76.66 ఏళ్లుగా ఉండనుందని అభిప్రాయపడింది. 2014-18 మధ్య దేశ ప్రజల సగటు ఆయుర్ధాయం 69.6 ఏళ్లుగా నమోదైంది.
మరోవైపు దేశ ప్రస్తుత జనాభా 136.1 కోట్లుగా అంచనా వేసిన కేంద్ర గణాంకశాఖ.. గడిచిన పదేళ్లలో జనాభా పెరుగుదల రేటు 1.6 నుంచి 1.1కి తగ్గినట్లు తన నివేదికలో పేర్కొంది. దేశంలో లింగ నిష్పత్తి స్వల్పంగా పెరిగినట్లు వెల్లడించింది. 2011లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 943మంది మహిళలుంటే, ప్రస్తుతం 948కి పెరిగినట్లు నివేదిక తెలిపింది.