కొవిడ్ కట్టడే లక్ష్యంగా తయారు చేస్తోన్న 'కొవాగ్జిన్' టీకా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. ఈ టీకా రెండు దశల క్లినికల్ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుందని ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ జరుగుతున్నాయని ట్విట్టర్ వేదికగా తెలిపింది. 22 కేంద్రాల్లో పరీక్షలు జరుపుతున్నట్లు వెల్లడించింది.
"ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్తంగా తయారు చేస్తోన్న కొవాగ్జిన్ మంచి ఫలితాలను ఇస్తోంది. కొవాగ్జిన్ సురక్షితమైందని తెలుస్తోన్న నేపథ్యంలో 'లాన్సెట్' జర్నల్ ఈ టీకా గురించి ప్రచురించేందుకు ఆసక్తి చూపుతోంది" అని ఐసీఎంఆర్ ట్వీట్ చేసింది.