తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బాంబుల మోత.. విద్యార్థినులపై సైన్యం వేధింపులు.. ఇంటికెప్పుడు వెళ్తామో!' - ఉక్రెయిన్​లో ఇండియన్ స్టూడెంట్స్

Indian Students In Ukraine: ఓ వైపు ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతుండగా.. మరోవైపు ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. తినడానికి ఆహారం, తాగేందుకు నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక రొమేనియా, పోలాండ్​ సరిహద్దుల్లోని బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న విద్యార్థినులపై అక్కడి సైన్యం దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు, వారిని లైంగికంగా వేధిస్తున్నట్లు విద్యార్థులు 'ఈటీవీ భారత్'​తో వాపోయారు.

Indian Students In Ukraine
ఉక్రెయిన్​లో భారతీయులు

By

Published : Feb 28, 2022, 1:46 PM IST

Indian Students In Ukraine: ఉక్రెయిన్​పై రష్యా దాడులు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. అసలే ఆహారం, నీళ్లు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతుండగా.. రొమేనియా, పోలాండ్ సరిహద్దుల్లోని కొందరు సైనికులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. దీంతో ఎటువైపు నుంచి ఏ ఆపద వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు భారతీయ విద్యార్థులు.

Indian students beaten in Ukraine: రొమేనియా, పోలాండ్ సరిహద్దుల్లోని బంకర్లలో తలదాచుకున్న విద్యార్థినులతో అక్కడి సైన్యం అసభ్యంగా ప్రవర్తించినట్లు, వారిని వేధింపులకు గురిచేసినట్లు 'ఈటీవీ భారత్​'తో పలువురు విద్యార్థులు వాపోయారు. రష్యన్ బలగాలు కొందమంది విద్యార్థినులను తీసుకెళ్లి లైంగికంగా వేధించినట్లూ పేర్కొన్నారు. మరికొందరు విద్యార్థులను కాలితో తన్నుతూ దాడికి పాల్పడ్డట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

"ఉక్రెయిన్​లో చిక్కుకున్న విద్యార్థులను భద్రత దృష్ట్యా పోలాండ్, రొమేనియా సరిహద్దుల్లోకి తీసుకెళ్లాయి రష్యా బలగాలు. రష్యన్ సైనికులు కొంతమంది విద్యార్థినులను బలవంతంగా తీసుకెళ్లారు. మరికొంతమందిపై దాడిచేశారు. వారిని లైంగికంగా వేధించారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఉక్రెయిన్​లోని భారత రాయబార కార్యాలయం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఫోన్​లు చేసినా స్పందన లేదు." అని ఖార్కివ్​లో చిక్కుకుపోయిన ఓ భారతీయ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆహారం, నీళ్లు కరవు..

తమకు ఆహారం, నీళ్లు లేవని ఖార్కివ్​లో చిక్కుకుపోయిన మరో విద్యార్థి 'ఈటీవీ భారత్​'తో చెప్పాడు. "ఇక్కడున్న విద్యార్థులతో ఉన్న ఆహారాన్ని పంచుకుంటున్నాం. ఉక్రెయిన్​లోని భారత రాయబార కార్యాలయం ఆదేశాలు జారీ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో అవి అమలు కావడంలేదు. భారత ఎంబసీ మమ్మల్ని ఎలా సురక్షితంగా స్వదేశానికి తీసుకెళ్తుందో తెలియదు." అని మరో విద్యార్థి వాపోయాడు.

ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు..

మరోవైపు ఉక్రెయిన్​లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారతీయులు ఎవరూ.. యుద్ధం జరిగే ప్రాంతాల్లో సంచరించొద్దని అడ్వైజరీ జారీ చేసింది. ఉక్రెయిన్‌ పశ్చిమ నగరాల్లో వసతులు ఉన్నచోట ఉండటం సురక్షితమని సూచించింది. పరిస్థితిని తెలుసుకోకుండా సరిహద్దు చెక్ పాయింట్‌లకు వెళ్లవద్దని పేర్కొంది.

తరలింపు ప్లాన్​ విద్యార్థులకు చెప్పండి..

Rahul Gandhi on Ukraine: ఉక్రెయిన్​లో వేల మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్న క్రమంలో కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు స్వదేశానికి తరలించే ప్రణాళికను తక్షణం అక్కడి విద్యార్థులకు తెలియజేసి వారిలో ధైర్యం నింపాలని సూచించారు. ఉక్రెయిన్​ సరిహద్దు దేశాల్లోని విద్యార్థినులపై సైన్యం వేధింపులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

"భారత విద్యార్థులు ఉక్రెయిన్​లో పడుతున్న బాధలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. తరలింపు ప్రక్రియను వెంటనే విద్యార్థులకు చెప్పాలి."

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ నేత

రాహుల్​గాంధీతోపాటు చాలామంది కాంగ్రెస్​ నాయకులు ఉక్రెయిన్​లో విద్యార్థులు పడుతున్న బాధలకు సంబంధించిన వీడియోలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఇవీ చూడండి:

ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్రమంత్రులు.. స్టూడెంట్స్​ను త్వరగా తరలించేందుకే..

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ సంక్షోభం నుంచి భారత్​ ఏం నేర్చుకోవాలి?

ABOUT THE AUTHOR

...view details