భారత్ గౌరవ్ రైళ్ల పేరుతో భారతీయ రైల్వే 190 కొత్త ట్రైన్స్‌ను(Indian Railways) దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు కేవలం సరకు, ప్రయాణికుల రవాణాకు మాత్రమే పరిమితమైన సంస్థ.. ఇప్పుడు మూడో సెగ్మెంట్‌గా పర్యాటకాన్ని(irctc tourism) ప్రోత్సహించేలా థీమ్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ట్రైన్స్‌ను ప్రైవేట్ సెక్టార్‌తో పాటు ఐఆర్సీటీసీ కూడా నడపుతుందని పేర్కొన్నారు.
"భారత్ గౌరవ్ రైళ్లు... సాధారణ ట్రైన్స్లా టైం టేబుల్‌ను అనుసరించవు. వీటి కోసం సుమారు 3,033 కోచ్‌లను, 190 రైళ్లను గుర్తించాం. ప్రయాణికులు, సరకు రవాణా సెగ్మెంట్ల తర్వాత పర్యాటకం కోసం ఈ థీమ్ ట్రైన్స్‌ను ప్రారంభిస్తాం. ఈ రైళ్లు భారతదేశ గొప్పదనం, సంస్కృతితో పాటు ఔన్నత్యాన్ని ప్రతిభింబించేలా రూపొందిస్తున్నాము. వీటి కోసం మంగళవారం నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం."