Indian Navy Jobs 2023 : ఇండియన్ నేవీలో సేవలు అందించాలని ఆశించే అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్. భారత నౌకాదళం 224 షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుషులు, మహిళలు ఈ పోస్టులకు అర్హులు.
పోస్టుల వివరాలు
Indian Navy SSC Officer Posts :
- జనరల్ సర్వీస్/ హైడ్రో కేడర్ - 40 పోస్టులు
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ - 8 పోస్టులు
- నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ - 18 పోస్టులు
- పైలెట్ - 20 పోస్టులు
- లాజిస్టిక్స్ - 20 పోస్టులు
- ఎడ్యుకేషన్ బ్రాంచ్ పోస్టులు - 18
- ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) - 30 పోస్టులు
- నావల్ కన్స్ట్రక్టర్ - 20 పోస్టులు
- మొత్తం పోస్టులు - 240
విద్యార్హతలు
Indian Navy SSC Officer Eligibility :అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి.. బీటెక్, బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ (ఐటీ), పీజీ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ (ఐటీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కలిగి ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా ఉండి తీరాలి.
ఎంపిక విధానం
Indian Navy SSC Officer Selection Process :అభ్యర్థులు డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు ఆధారంగా.. మెరిట్ లిస్ట్‌ను తయారు చేస్తారు. తరువాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. తరువాత వైద్య పరీక్షలు చేసి, ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. వీటన్నింటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
Indian Navy SSC Officer Salary :కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)లో 2024 జూన్ నుంచి.. ఆయా శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ ప్రారంభం అవుతుంది. ఈ శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున జీతం అందిస్తారు. అలాగే ఇతర అలవెన్స్ కూడా ఇస్తారు.