తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Afghan Forces: అఫ్గాన్​ సైనికులకు భారత్​లోనే శిక్షణ! - అప్గాన్​ సైనికులకు శిక్షణపై భారత్​

భారత్​లో సైనిక శిక్షణలో ఉన్న అఫ్గాన్​ క్యాడెట్ల(Afghanistan Forces) కోర్సు పూర్తిస్థాయిలో అయిపోయేంత వరకు ఇక్కడే ఉండనున్నట్లు భారత సైన్యం(Indian Army) తెలిపింది. అనంతరం వారి భవిష్యత్తును ఆ దేశ రాయబార కార్యాలయానికి వదిలేస్తామని పేర్కొంది.

Afghan cadets training
అఫ్గాన్​ సైనికులకు భారత్​లో శిక్షణ

By

Published : Sep 3, 2021, 8:31 AM IST

భారత్‌లో సైనిక శిక్షణ పొందుతున్న ఆఫ్గానిస్థాన్‌ సైనికులకు(Afghanistan Forces) వారి కోర్సు పూర్తయ్యే వరకు కొనసాగిస్తామని సైన్యం (Indian Army) స్పష్టంచేసింది. ఆ తర్వాత వారి భవిష్యత్‌పై అఫ్గాన్‌ రాయబార కార్యాలయం నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. భారత్‌లోని వివిధ సైనిక శిక్షణ కేంద్రాల్లో దాదాపు 130 మంది అఫ్గాన్‌ సైనికులు శిక్షణ పొందుతుండగా వారిలో 80 మంది దేహ్రాదూన్​లోని మిలిటరీ అకాడమీలో ఉన్నట్లు సైన్యం పేర్కొంది.

'అఫ్గాన్​ సైనికుల శిక్షణను కొనసాగిస్తాం. సంబంధిత కోర్సులను పూర్తి చేయడానికి అనుమతించాలని మేం నిర్ణయించాం. అనంతరం వారిని అఫ్గాన్​ రాయబార కార్యాలయానికి అప్పగిస్తాం. వారి తదనంతర భవిష్యత్తుపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు.'

-ఆర్మీ అధికారులు

దాదాపు దశాబ్దకాలంగా అఫ్గాన్‌కు చెందిన సైనికులకు భారత్‌ శిక్షణ ఇస్తోంది. ఇప్పటివరకు వేల సంఖ్యలో అఫ్గాన్‌ సైనికులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. అయితే వీరిని తాలిబన్ సైన్యంలోకి(Afghanistan Taliban) తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ఇదీ చూడండి:విదేశీయుల వీసా గడువు పెంపు.. ఎప్పటివరకంటే?

ABOUT THE AUTHOR

...view details