తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​-అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందాలు- ఇక చైనాకు చుక్కలే!

India US Defence Relations : భారత్​-యూఎస్​ మధ్య బంధం గతంలో కంటే బలంగా ఉందన్నారు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్​. ఇరు దేశాలు సంయుక్తంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తయారు చేస్తాయని తెలిపారు.

india us defence relations
india us defence relations

By PTI

Published : Nov 10, 2023, 5:41 PM IST

Updated : Nov 10, 2023, 6:24 PM IST

India US Defence Relations : భారత్​, యూఎస్​ సంయుక్తంగా సైనికులకు ఉపయోగపడే బుల్లెట్​ ప్రూఫ్ వాహనాలను తయారు చేస్తాయని ప్రకటించారు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్​ ఆస్టిన్. చైనా నుంచి భారత్​కు పెరుగుతున్న భద్రతా సవాళ్లు సహా అనేక సమస్యలపై ఇరుదేశాలు చర్చించాయని తెలిపారు. అమెరికా నుంచి భారత్​ 31MQ-9B డ్రోన్ల కొనుగోలు డీల్​ గురించి సరైన సమయంలో ప్రకటిస్తామని అన్నారు. భారత్‌-అమెరికా 2+2 మంత్రుల స్థాయి సమావేశం శుక్రవారం దిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

అమెరికా, భారత్​ మధ్య బంధం గతంలో కంటే బలంగా ఉందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్​ ఆస్టిన్ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా, ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితులపై భారత్​తో చర్చించామని వివరించారు. 'అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు భారత్​తో కలిసి పనిచేస్తున్నాం. భారత్​కు చైనా నుంచి పెరుగుతున్న భద్రతా సవాళ్లను సైతం చర్చించాం. నేను, మా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్​.. భారత కేంద్ర మంత్రులతో ఫలవంతమైన చర్చలు జరిపాం' అని రక్షణ మంత్రి ఆస్టిన్ తెలిపారు.

భారత్‌-అమెరికా 2+2 మంత్రుల స్థాయి సమావేశం దిల్లీలో శుక్రవారం జరిగింది. అంతకు ముందు ఇరు దేశాల విదేశాంగ మంత్రులు దిల్లీలో భేటీ అయ్యారు. 'ఇరు దేశాల మధ్య బంధం ఎన్నడూ లేనంత బలంగా ఉంది. ఈ సంవత్సరం భారత నాయకత్వ పటిమ జీ20 నిర్వహణతో రుజువైంది. మా రక్షణశాఖ సహచరులతో కలిసి మేం చేయాల్సింది చాలా ఉంది. ఇండో-పసిఫిక్‌పై అమెరికా బలంగా దృష్టి సారించిందన్న విషయానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. భారత్‌తో కలిసి ఇండో-పసిఫిక్‌ ప్రాంత భవిష్యత్తు కోసం పనిచేస్తాం' అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు.

అలాగే.. జీ20 నిర్వహణకు సహకరించిన అమెరికాకు కేంద్ర మంత్రి ఎస్‌ జైశంకర్‌ ధన్యవాదాలు తెలిపారు. 'మేం చాలా విజయవంతంగా జీ20 సదస్సు నిర్వహించాం. అందుకు అమెరికా అధ్యక్షుడు, ప్రభుత్వానికి మా ప్రధాని మోదీ తరఫున ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అమెరికా సహకారం లేకపోతే.. ఈ సదస్సులో ఏకాభిప్రాయం సాధ్యమవుతుందని నేను అనుకోవడంలేదు' అని జైశంకర్ పేర్కొన్నారు.

సన్నిహిత సంబంధాలున్న దేశాల మధ్య వివిధ కార్యక్రమాలు, రక్షణ, భద్రతకు సంబంధించిన అంశాలపై పురోగతిని సమీక్షించేందుకు 2+2 విధానంలో చర్చలు నిర్వహిస్తారు. భారత్​- అమెరికా ఇప్పటివరకు ఐదు సార్లు 2+2 చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ పాల్గొన్నారు. భారత్​ తరఫున కేంద్ర మంత్రి జైశంకర్​, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ పాల్గొన్నారు.

ఊపిరి పీల్చుకున్న దిల్లీ- పలుచోట్ల వర్షం, మెరుగైన గాలి నాణ్యత- 400 దిగువకు AQI

గాజా మారణహోమాన్ని ఆపాలని భారత్​కు ఇరాన్ వినతి- యుద్ధానికి ఇజ్రాయెల్ విరామం!

Last Updated : Nov 10, 2023, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details