తెలంగాణ

telangana

'వాళ్లను తిరిగి గల్ఫ్ దేశాలకు అనుమతించండి'

By

Published : Nov 4, 2020, 1:21 PM IST

కరోనా కారణంగా సొంతూళ్ల వచ్చిన భారతీయులను.. తిరిగి గల్ఫ్​ దేశాలకు అనుమతించాలని విదేంశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కోరారు. అరబ్ దేశాల అధికారులతో నిర్వహించిన వర్చువల్​ సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు.

India_Gulf countries
'వాళ్లను తిరిగి గల్ఫ్ దేశాలకు అనుమతించండి'

భారతీయ కూలీలను, ఉద్యోగులను తిరిగి గల్ఫ్​ దేశాలకు అనుమతించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్​ జయశంకర్.. అరబ్​ దేశాలను కోరారు. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్​(జీసీసీ)తో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమావేశంలో జయశంకర్​ ఈ వినతి చేశారు. కరోనా లాక్​డౌన్​ సమయంలో భారతీయ కూలీలకు ఆశ్రయమిచ్చిన అరబ్​ దేశాలకు​ కృతజ్ఞతలు తెలిపారు.

'విదేశాల్లో ఉన్న వేల మంది కరోనా కారణంగా సొంతిళ్లకు చేరారు. లాక్​డౌన్​ అనంతరం వారు తిరిగి తమ పనులకు హాజరుకావాలని ఆశిస్తున్నారు. వారు క్షేమంగా తిరిగి విదేశాలకు చేరేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. అవసరం అయితే భారత్​ కూడా అందుకు సహకరిస్తుంది' అని జయశంకర్​ అన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ సమావేశానికి ఎస్​ జయశంకర్​తో పాటు జీసీసీ జనరల్ సెక్రటరీ నయీఫ్ ఫాలా ఎమ్ అల్-హజ్రఫ్, బహ్రెయిన్ విదేశాంగ మంత్రి అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, యూఏఈ విదేశాంగ మంత్రి అన్వర్​ బిన్ మహమ్మద్ గర్గష్ హాజరయ్యారు. సౌదీ అరేబియా, కువైట్, కటార్​కి చెందిన సీనియర్​ అధికారులు కూడా హాజరయ్యారు.

సమావేశంలో చర్చించిన ఇతర కీలక అంశాలు..

  • రాజకీయ, ఆర్థిక, ఇతర విషయాల్లో పరస్పరం సాయం చేసుకోవాలని భారత్​-జీసీసీ దేశాలు నిర్ణయించుకున్నాయి.
  • 2021 నుంచి భారత్​ను ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్​లో నాన్​-పర్మనెంట్​ మెంబర్​గా పరిగణించాలని జీసీసీ దేశాలు కోరాయి.
  • కొవిడ్-19, టెర్రరిజం వంటి కీలక విషయాల్లో సహాయం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాయి.

ఇదీ చదవండి:బాలుడు​ కిడ్నాప్​ డ్రామా- రూ.50కోట్లు డిమాండ్

ABOUT THE AUTHOR

...view details