తెలంగాణ

telangana

ETV Bharat / bharat

G20 Summit: 2023లో జీ20కి భారత్​ ఆతిథ్యం

భారత్​లో తొలిసారిగా జీ20 శిఖరాగ్ర సదస్సు(G20 Summit) జరగనుంది. 2023 సంవత్సరంలో జీ20 సదస్సుకు (G20 Summit 2023) భారత్​ ఆతిథ్యం ఇస్తున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సదస్సులో మొత్తం 19 దేశాలు పాల్గొంటాయి.

g20 summit 2023
2023లో జీ20కి భారత్​ ఆతిథ్యం

By

Published : Sep 8, 2021, 6:43 AM IST

జీ20 శిఖరాగ్ర సదస్సు నిర్వహణకు (G20 Summit) భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2023లో జీ20 సదస్సు (G20 Summit 2023).. భారత్​ వేదికగా జరగనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత్​లో జీ20 సదస్సు జరగడం ఇదే తొలిసారి. ఈ సదస్సు నిర్వహణ బాధ్యతలు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్​ గోయల్​కు అప్పగించనున్నట్లు వెల్లడించింది. 'భారత్​.. డిసెంబరు 1, 2022 నుంచి జీ20 సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది. 2023లో సదస్సును నిర్వహిస్తారు' అని పేర్కొంది.

ఈ సదస్సులో (G20 Summit) మొత్తం 19 దేశాలు పాల్గొంటాయి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్​, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా సభ్య దేశాలుగా ఉన్నాయి.

ఈ ఏడాది జీ20 సదస్సుకు ఇటలీ ఆతిథ్యం ఇస్తోంది. ఇది అక్టోబరు 30, 31 తేదీల్లో జరగనుంది.

ఇదీ చూడండి :'జాతీయ క్రీడగా హాకీ' పిటిషన్​ను తిరస్కరించిన సుప్రీం

ABOUT THE AUTHOR

...view details