Corona Cases In India: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. మరో 2,593 మందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు. 1755మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 57 వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేలకు పైగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.59శాతానికి పైగా ఉంది.
- యాక్టివ్ కేసులు: 15,873
- మొత్తం మరణాలు: 5,22,193
- మొత్తం కేసులు: 4,30,57,545
- రికవరీలు: 4,25,19,479
Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. శనివారం 19,05,374 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,67,20,318కు చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలో 5,48,694 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 1,524 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- జర్మనీలో 89,665 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 153 మంది మృతిచెందారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 80,571 మంది వైరస్ సోకింది. మరో 75 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 75, 414 కరోనా కేసులు నమోదయ్యాయి. 151 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో 70, 520 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 143 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 17, 987 కరోనా కేసులు బయటపడ్డాయి. 77 మంది వైరస్‌కు బలయ్యారు.
ఇదీ చదవండి:యాచకురాలి పెద్ద మనసు.. గుడిలో అన్నదానం కోసం రూ.లక్ష విరాళం