దేశంలో కరోనా కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 68,020 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 291 మంది మరణించారు. 32,231 మంది వైరస్ను జయించారు.
- మొత్తం కేసులు:1,20,39,644
- మొత్తం మరణాలు:1,61,843
- కోలుకున్నవారు:1,13,55,993
- యాక్టివ్ కేసులు:5,21,808
మార్చి 28నాటికి దేశవ్యాప్తంగా 24,18,64,161 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఆదివారం ఒక్కరోజే 9,13,319 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.