తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Corona cases: మళ్లీ 40వేల పైకి కరోనా కేసులు - కొవిడ్​ పరీక్షలు

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 41,806 కరోనా కేసులు(Corona cases) నమోదయ్యాయి. 581 మంది కరోనా బారినపడి మృతి చెందారు.

corona cases
దేశంలో కొత్తగా 41,806 కరోనా కేసులు

By

Published : Jul 15, 2021, 9:38 AM IST

Updated : Jul 15, 2021, 9:53 AM IST

ఆంక్షల సడలింపుతో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు.. మళ్లీ 40వేలపైకి చేరుకున్నాయి. కొత్తగా 41,806 మందికి వైరస్​ సోకింది. వైరస్ బారినపడి 581 మంది ప్రాణాలు విడిచారు. కొత్తగా 39,130 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు:3,09,87,880
  • మొత్తం మరణాలు:4,11,989
  • కోలుకున్నవారు:3,01,43,850
  • యాక్టివ్​ కేసులు:4,32,041

దేశంలో ఇప్పటివరకు 43,80,11,958 కరోనా పరీక్షలు నిర్వహించారు. బుధవారం 19,43,488 కరోనా టెస్టులు జరిపినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

వ్యాక్సినేషన్:

దేశంలో ఇప్పటివరకు 39,13,40,491 డోసులు పంపిణీ చేసినట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 34,97,058 డోసులు అందించినట్లు తెలిపింది.

ప్రపంచంలో కొవిడ్​ కేసులు..

ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 5,54,510 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 8,715 మంది చనిపోయారు. కాగా 3,70,903 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 189,140,489గా ఉంది.

  • అమెరికా - 34,848,068
  • బ్రెజిల్​ - 19,209,729
  • రష్యా - 5,857,002
  • ఫ్రాన్స్​ - 5,829,724
  • యూకే - 5,233,207

ఇదీ చదవండి :కరోనాను జయించినా టీకా తీసుకుంటేనే సేఫ్​!

Last Updated : Jul 15, 2021, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details