భారత్లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. తాజాగా 38,667 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 478 మంది మరణించారు. కొత్తగా 35,743 మంది కరోనాను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 97.46 శాతానికి చేరగా.. క్రియాశీలక కేసులు 1.20 శాతానికి తగ్గాయి.
మొత్తం కేసులు:3,21,56,493
మొత్తం మరణాలు: 4,30,732
కోలుకున్నవారు:3,13,38,088
యాక్టివ్ కేసులు: 3,87,673
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- కేరళలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కేరళలో కొత్తగా 20,452 కేసులు నమోదయ్యాయి . 16,856 మంది కోలుకోగా 114 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరో 6,686 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. కరోనా ధాటికి 158 మంది మృతిచెందగా.. 5,861 మంది మహమ్మారిని జయించారు.
- తమిళనాడులో కొత్తగా 1,933 కరోనా కేసులు బయటపడ్డాయి. 1,887 మంది కోలుకోగా.. 34 మంది మృతిచెందారు.
- కర్ణాటకలో కొత్తగా 1,669 మందికి కరోనా సోకగా.. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,672 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- ఒడిశాలో కొత్తగా 1,193 కొవిడ్ కేసులు నమోదుకాగా.. 60 మంది మృతిచెందారు.
- మిజోరంలో కొత్తగా 575 కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 174కు చేరింది.
ఇదీ చదవండి:'వ్యాక్సిన్ మిక్సింగ్ వద్దు- మూడో డోసే మంచిది'