తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో స్థిరంగా కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు

దేశంలో కొత్తగా 2,827 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 24 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3,230 మంది కోలుకున్నారు.

India corona cases
కరోనా కేసులు

By

Published : May 12, 2022, 9:47 AM IST

Covid 19 India:భారత్​లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 2,827 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 24మంది చనిపోయారు. ఒక్కరోజే 3,230 మంది కోలుకొని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. యాక్టివ్​ కేసులు 19 వేల 100 దిగువకు చేరాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.60 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 0.72 శాతంగా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,31,13,437
  • మొత్తం మరణాలు:5,24,181
  • యాక్టివ్​ కేసులు: 19,067
  • కోలుకున్నవారి సంఖ్య: 4,25,70,165

Vaccination India:దేశవ్యాప్తంగా బుధవారం 14,85,292 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,90,83,96,788కి చేరింది. ఒక్కరోజే 4,71,276 కరోనా టెస్టులు నిర్వహించారు.
Global Corona Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కొత్తగా 5,75,895 కేసులు వెలుగుచూశాయి. మరో 1,534 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 51,90,10,979కు చేరింది. మరణాల సంఖ్య 62,82,141 వేలకు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 47,38,03,665గా ఉంది.

  • జర్మనీలో రికార్డుస్థాయిలో ఒక్కరోజే 93,102 కేసులు, 227 మరణాలు నమోదయ్యాయి.
  • అమెరికాలో దాదాపు 87,487 కేసులు వెలుగుచూశాయి. మరో 226 మంది కొవిడ్​ వైరస్​కు బలయ్యారు.
  • ఇటలీ, ఫ్రాన్స్​లో 40 వేల చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా 115, 96 చొప్పున మరణించారు.
  • దక్షిణ కొరియాలో 43,899 కేసులు, జపాన్​లో 39 వేలు, బ్రెజిల్​లో 23 వేల చొప్పున కొత్త కేసులు వెలుగుచూశాయి

ఇదీ చదవండి:టమాటా ఫ్లూ కలకలం.. ఆస్పత్రుల పాలవుతున్న చిన్నారులు!

ABOUT THE AUTHOR

...view details