భారత్లో కరోనా తీవ్రత పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 24,882 కొత్త కేసులు వెలుగుచూశాయి. గత 83 రోజుల్లో ఈ కేసులే అత్యధికం. చివరగా గతేడాది డిసెంబర్ 20న 26 వేల 624 మంది వైరస్ బారినపడ్డారు.
ప్రస్తుత రికవరీ రేటు.. 96.82 వద్ద ఉంది. మొత్తం మరణాల సంఖ్య లక్షా 58 వేల 446కు చేరింది.
- మొత్తం కేసులు:1,13,33,728
- మొత్తం మరణాలు:1,58,446
- కోలుకున్నవారు:1,09,73,260
- యాక్టివ్ కేసులు:2,02,022