దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 35,342 మందికి వైరస్(Corona Cases) సోకగా.. 38,740 మంది కోలుకున్నారు. 483 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు:3,12,93,062
- మొత్తం మరణాలు:4,19,470
- కోలుకున్నవారు:3,04,68,079
- యాక్టివ్ కేసులు:4,05,513
వ్యాక్సినేషన్
దేశంలో ఇప్పటివరకు 42,34,17,030 కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం ఒక్కరోజే 54,76,423 డోసులు అందించినట్లు తెలిపింది.
పరీక్షలు
దేశవ్యాప్తంగా గురువారం 16,68,561 మందికి పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు..
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 5,64,878 మందికి కరోనా సోకింది. వైరస్ ధాటికి మరో 8,779 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19,33,71,433కు చేరింది. మరణాల సంఖ్య 41,50,866కు పెరిగింది.
కొత్త కేసులు..
- అమెరికా- 61,651
- బ్రెజిల్- 49,603
- ఫ్రాన్స్- 21,909
- బ్రిటన్- 39,906
- రష్యా- 24,471
ఇవీ చూడండి: