దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 16,752 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 113 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 1,10,96,731
- మరణాలు: 1,57,051
- రికవరీల సంఖ్య: 1,07,75,169
- యాక్టివ్ కేసులు: 1,64,511
వైరస్ సోకిన వారిలో 11,718 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్త రికవరీ రేటు మరోసారి తగ్గి.. 97.10కి చేరింది. మరణాల రేటు స్థిరంగా 1.42 శాతంగా ఉంది.