తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దు దాటి భారత్​లోకి పాక్ బాలిక.. జవాన్లు ఏం చేశారంటే? - ఫజలికా సరిహద్దు

India Pakistan border: పాకిస్థాన్​కు చెందిన ఓ నాలుగేళ్ల బాలిక.. పంజాబ్​లోని అబోహర్​ సెక్టార్​లో పొరపాటున సరిహద్దు దాటి భారత్​లోకి ప్రవేశించింది. ఆమెను బీఎస్​ఎఫ్​ జవాన్లు.. పాక్​ అధికారులకు అప్పగించారు.

India Pakistan border
బాలిక

By

Published : Mar 24, 2022, 7:32 PM IST

India Pakistan border: పొరపాటున సరిహద్దులు దాటి భారత్​లోకి ప్రవేశించింది పాకిస్థాన్​కు చెందిన ఓ నాలుగేళ్ల బాలిక. పంజాబ్​లోని ఫజలికా జిల్లా అబోహర్​ సెక్టార్​లో ఆమెను గుర్తించిన స్థానికులు సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) జవాన్లకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న భారత జవాన్లు బాలికతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు.

సరిహద్దు దాటి భారత్​లోకి ప్రవేశించిన బాలిక

పొరుగు దేశానికి చెందిన బాలికగా గుర్తించిన జవాన్లు.. పాకిస్థాన్​ రేంజర్లను సంప్రదించారు. మానవతా కోణంలో బాలికను వారికి అప్పగించారు. అనుకోకుండా సరిహద్దులు దాటి భారత్​లోకి ప్రవేశించిన బాలికను పాకిస్థాన్​ అధికారులకు అప్పగించిన బీఎస్​ఎఫ్​ జవాన్లపై స్థానికులు ప్రశంసలు కరిపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details