తెలంగాణ

telangana

ETV Bharat / bharat

6 జలాంతర్గాముల కోసం భారత నేవీ రూ. 50వేల కోట్లు - ఎల్​ అండ్​ టీ

నౌకా దళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది రక్షణ మంత్రిత్వశాఖ. ప్రాజెక్టు-75 కింద.. దేశంలో ఆరు అధునాతన డీజిల్​, ఎలక్ట్రిక్​ సబ్​మెరైన్లను నిర్మించేందుకు రూ.50,000 కోట్ల విలువైన టెండర్లను మజగావ్‌ డాక్‌యార్డ్‌ లిమిటెడ్‌(ఎండీఎల్), ఎల్​ అండ్‌ టీకి జారీ చేసింది.

submarine
జలాంతర్గాములు

By

Published : Jul 20, 2021, 9:06 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేక్‌ ఇన్‌ ఇండియా దిశగా మరో ముందడుగు వేసింది. ఆరు అధునాతన డీజిల్​, ఎలక్ట్రిక్​ జలాంతర్గాముల నిర్మాణానికి రూ.50 వేల కోట్ల విలువచేసే టెండర్లను మజగావ్‌ డాక్‌యార్డ్‌ లిమిటెడ్‌(ఎండీఎల్), ఎల్​ అండ్‌ టీకి జారీ చేసింది రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ ప్రాజెక్టుపై రక్షణమంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో చర్చించి అన్ని అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

స్కార్పియన్‌, కల్వరీ జలాంతర్గాముల నిర్మాణం జరిగిన ఎన్నో ఏళ్ల తర్వాత పి-75 ఇండియా ప్రాజెక్టు పేరుతో 6 అధునాతన జలాంతర్గాములను ఫ్రాన్స్‌ భాగస్వామ్యంతో.. మజగావ్‌ డాక్‌యార్డ్‌ లిమిటెడ్‌(ఎండీఎల్) నిర్మిస్తోంది. ఇప్పటికే ఎండీఎల్, ఎల్​ అండ్‌ టీని వ్యూహాత్మక భాగస్వాములుగా గుర్తించిన నౌకాదళం.. ఐదు ప్రపంచ తయారీ సంస్థలైన ఫ్రెంచ్‌ నావల్‌ గ్రూప్‌, జర్మన్‌ టీకేఎంఎస్, దక్షిణ కొరియా దేవూ, స్పానిష్‌, రష్యా సంస్థలతో ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:ఆ సబ్​మెరైన్లలో 95% దేశీయ పరికరాలే!

ABOUT THE AUTHOR

...view details