2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల ఏడాదిగా గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతు పలికిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌తోపాటు బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, నైజీరియా, రష్యా దేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. 70 దేశాలు ఈ తీర్మానాన్ని అంగీకరించాయి.
"తృణధాన్యాల ప్రాచుర్యం పెంచేందుకు భారత్ కృషి చేయడం మంచి విషయం. వీటి ఉత్పత్తి రైతుల సంక్షేమానికి తోడ్పడుతుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలకు, అంకురాలకు ఇది పరిశోధన అవకాశాలు పెంచుతుంది."
-నరేంద్ర మోదీ, ప్రధాని.