చరిత్రలో విజయవంతమైన వ్యాక్సిన్లను అందించిన ఘనత భారత్‌కు ఉందని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ విజయ్ రాఘవన్ అన్నారు. దీనిపై ఎలాంటి చర్చ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. టీకాల సమర్థత ఎంతో ముఖ్యమని, అది రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే విధంగా ఉండాలని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని అది సమర్థవంతంగా అడ్డుకోగలగాలని చెప్పారు.
'విజయవంతమైన టీకాలు అందించిన చరిత్ర మనది'
విజయవంతమైన వ్యాక్సిన్లను అదించిన చరిత్ర భారత్‌కు ఉందని చెప్పారు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ విజయ్ రాఘవన్. ఈ విషయంపై చర్చించాల్సిన అవసరమే లేదన్నారు. టీకాల సమర్థత ఎంతో ముఖ్యమని, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే విధంగా ఉండాలని పేర్కొన్నారు.
దేశంలో ఐదు టీకాలు వివిధ ప్రయోగ దశల్లో ఉన్నాయన్నారు విజయ్ రాఘవన్. వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ కఠిన పరిస్థితులతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఒకప్పుడు ఏదైనా మహమ్మారి విజృంభిస్తే ఎలాంటి చర్చ జరిగేది కాదని, ఫలితంగా టీకా బయటకు వచ్చేందుకు 10 ఏళ్ల సమయం పట్టేదని పేర్కొన్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఏదైనా కొత్త వైరస్ వస్తే దానిపై ప్రపంచం చర్చించుకుంటుందని తెలిపారు. అలాగే వైరస్‌పై అన్నిరకాల డిబేట్లు జరుగుతున్నాయని చెప్పారు.
ఇదీ చూడండి: 'కొవాగ్జిన్' టీకా సమర్థవంతం.. భద్రతకే ప్రాధాన్యం