India Covid cases: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 9,195 కేసులు వెలుగుచూశాయి. మరో 302 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,347 మంది కోలుకున్నారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కు పెరిగింది.
- మొత్తం కేసులు: 3,48,08,886
- మొత్తం మరణాలు: 4,80,592
- యాక్టివ్ కేసులు: 77,002
- కోలుకున్నవారు: 3,42,51,292
Omicron Cases In India State Wise
ఒమిక్రాన్ కలవరం..
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 781కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల్లో 241 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వైరస్ విస్తరించినట్లు పేర్కొంది.
- దిల్లీలో: 238
- మహారాష్ట్రలో : 167
- గుజరాత్లో : 73
- కేరళలో : 65
- తెలంగాణలో: 62
Vaccination in India
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం మరో 64,61,321 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,43,15,35,641 కు చేరింది.
Covid world cases
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భయపెడుతున్నాయి. ఒక్కరోజే 12,19,556 కేసులు వెలుగులోకి వచ్చాయి. 6,570 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 3.12లక్షల కేసులు నమోదయ్యాయి. 1,811 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8,42,161కు పెరిగింది.
- బ్రిటన్‌లో 1.29 లక్షల కేసులు వెలుగులోకివచ్చాయి. మరో 18 మంది వైరస్‌కు బలయ్యారు.
- ఫ్రాన్స్‌లో 1.79 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 290 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,23,188కు చేరింది.
- స్పెయిన్‌లోనూ కరోనా తీవ్రంగానే ఉంది. కొత్తగా 99,671 కేసులు బయటపడ్డాయి. 114 మంది మృతి చెందారు.
- ఇటలీలో కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదవుతోంది. కరోనా తీవ్రతకు మరో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 76 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం మరణాల సంఖ్య 1,36,955కు చేరుకుంది.
ఇదీ చదవండి:Omicron Cases: అక్కడ కొత్త కరోనా కేసుల్లో ఒమిక్రాన్‌వే 60 శాతం!