Covid Cases in India: దేశంలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 20,038 మంది వైరస్ బారినపడగా.. మరో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి తాజాగా 16,994 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.49 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.31 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉంది.
- మొత్తం మరణాలు:5,25,604
- యాక్టివ్ కేసులు: 1,39,073
- కోలుకున్నవారి సంఖ్య: 4,30,45350
Vaccination India: భారత్‌లో గురువారం 18,92,969 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,99,47,34,994కు చేరింది. మరో 4,50,820 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 9,28,291 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,524 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 56,53,11,844కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 63,82,181 మంది మరణించారు. ఒక్కరోజే 5,31,200మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య53,68,03,187కు చేరింది.
- ఫ్రాన్స్‌లో కొత్తగా 1,19,285 మందికి కరోనా సోకగా.. 54 మంది మరణించారు.
- జర్మనీలో 109,694 కొత్త కేసులు నమోదు కాగా.. 115 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో కొత్తగా 1,07,122 మందికి వైరస్ సోకగా.. 105 మంది మరణించారు.
- అమెరికాలో ఒక్కరోజే 95,400 మంది కొవిడ్ బారినపడగా.. 231మంది ప్రాణాలు కోల్పోయారు..
- జపాన్‌లో కరోనా ఉద్ధృతి పెరిగింది. కొత్తగా 92,507 మందికి వైరస్ సోకింది. 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో 65,379 కేసులు నమోదు కాగా.. 292 మంది మరణించారు.