India Covid Cases: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. కొత్తగా 4,194 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 255 మంది మరణించారు. 6,208 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు మెరుగుపడి 98.70 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.10 శాతానికి తగ్గింది. మరణాల రేటు 1.20 శాతానికి చేరింది.
- మొత్తం కేసులు:42,984,261
- మొత్తం మరణాలు:5,15,714
- యాక్టివ్ కేసులు:42,219
- కోలుకున్నవారు:4,24,26,328
Vaccination in India
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గురువారం మరో 16,73,515 డోసులు పంపిణీ చేశారు. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,79,72,00,515కు పెరిగింది.
World Corona cases
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. తాజాగా 17,98,870 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 45,37,45,428కి పెరిగింది. మరో 6,686 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,051,355కు చేరింది.
- జర్మనీలో కొత్తగా 3,00,270 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 154 మంది మృతి చెందారు.
- అమెరికాలో తాజాగా 38,038 మంది కొవిడ్ బారినపడ్డారు. మరో 1,247 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో కొత్తగా 51,231 కరోనా కేసులు బయటపడ్డాయి. 665 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 55,861మందికి వైరస్ సోకగా.. 559 మంది వైరస్‌కు చనిపోయారు.
ఇదీ చూడండి:'మాది పురుషుల రాష్ట్రం.. అందుకే అత్యాచార కేసుల్లో నంబర్ వన్'