India Covid Cases: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 1,054 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 29 మంది మరణించారు. శనివారంతో పోలిస్తే మరణాల సంఖ్య తగ్గింది. మరోవైపు 1,258 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.76 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు 11,132 ఉన్నాయి.
• యాక్టివ్ కేసులు: 11,132
• మరణాలు: 5,21,685
• మొత్తం కేసులు: 4,30,35,271
• రికవరీలు:4,25,02,454
Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 14,38,792 మందికి శనివారం టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 185.70 కోట్లకు చేరింది. 4,18,345 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 79,38,47,740 కరోనా పరీక్షలు చేశారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 8,18,784 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2,217 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- దక్షిణ కొరియాలో తాజాగా 185,495 కరోనా కేసులు నమోదయ్యాయి. 338 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 100,037 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 170 మంది మృతి చెందారు.
- ఫ్రాన్స్‌లో 141,690 కరోనా కేసులు బయటపడ్డాయి. 87 మంది మృతి చెందారు.
- ఇటలీలో 63,992 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.112 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జపాన్‌లో తాజాగా 52,104మంది వైరస్ సోకింది. మరో 62 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:అండమాన్, ఉత్తరాఖండ్‌లో భూకంపాలు.. భయంతో జనం పరుగులు