India Corona Cases: భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,841 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇందులో దిల్లీ నుంచే 1032 మంది బాధితులు ఉన్నారు. మరో 9 మంది చనిపోయారు. ఒక్కరోజే 3,295 మంది కోలుకొని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. యాక్టివ్ కేసులు 19 వేల దిగువకు చేరాయి. యాక్టివ్ కేసుల శాతం 0.04గా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,31,16,254
- మొత్తం మరణాలు:5,24,190
- యాక్టివ్ కేసులు: 18604
- కోలుకున్నవారి సంఖ్య: 42573460
Vaccination India:దేశవ్యాప్తంగా గురువారం 14,03,220 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,90,99,44,803కి చేరింది. ఒక్కరోజే 4,86,628 కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు దాదాపు 6 లక్షల కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 51,96,57,147కు చేరింది. మరణాల సంఖ్య 62,84,432కు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 47,44,09,097గా ఉంది.
- అమెరికాలో 85 వేలకుపైగా కొత్త కేసులు, 222 మరణాలు వెలుగుచూశాయి. కొవిడ్‌తో మొత్తం మరణించిన వారి సంఖ్య 10 లక్షల 26 వేలు దాటింది.
- జర్మనీలో ఒక్కరోజే 82 వేల కేసులు, 179 మరణాలు నమోదయ్యాయి.
- ఇటలీ, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌ల్లో సగటున 35 వేలకుపైగా కరోనా బారినపడుతున్నారు. మరణాల సంఖ్య వందకుపైనే నమోదవుతోంది.
- ఆస్ట్రేలియాలో గురువారం 57 వేలు, జపాన్‌లో 45 వేలమందికిపైగా వైరస్ సోకింది.