India Covid Cases: దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య నాలుగువేల దిగువన నమోదైంది. కొత్తగా 3,116 మంది వైరస్ బారిన పడ్డారు. గత 676 రోజుల్లో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా ధాటికి మరో 47 మంది మృతి చెందారు. తాజాగా 5,559 మంది వైరస్‌ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 98.71 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.09 శాతానికి తగ్గింది. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.
- మొత్తం కేసులు:4,29,90,991
- మొత్తం మరణాలు:5,15,850
- యాక్టివ్ కేసులు:38,069
- కోలుకున్నవారు:4,24,37,072
Vaccination in India
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. శనివారం మరో 20,31,275 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,80,13,23,547కు పెరిగింది.
World Corona cases
ప్రపంచవ్యాప్తంగానూ రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో తగ్గింది. తాజాగా 16,89,274 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 45,71,83,829కి పెరిగింది. మరో 4,571 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,062,081కు చేరింది.
- దక్షిణ కొరియాలో 3,83,651 కరోనా కేసులు నమోదయ్యాయి. 10,144 మంది కరోనా రోగులు మరణించారు.
- జర్మనీలో తాజాగా 1,45,267 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 166 మంది మృతి చెందారు.
- అమెరికాలో కొత్తగా 12,261 మంది కొవిడ్ బారినపడ్డారు. మరో 460 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో ఒక్కరోజే 48,154 కరోనా కేసులు బయటపడ్డాయి. 630 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 45,265 మందికి వైరస్ సోకగా.. 381 మంది వైరస్‌కు చనిపోయారు.
- ఫ్రాన్స్‌లో 72,443 కరోనా కేసులు బయటపడ్డాయి. 51 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి:భర్త తల నరికి.. గుడి దగ్గర ప్లాస్టిక్ సంచిలో...