Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా 2,86,384 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 573 మంది మరణించారు. 3,06,357 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:4,03,71,500
- మొత్తం మరణాలు:4,91,700
- యాక్టివ్ కేసులు:22,02,472
- మొత్తం కోలుకున్నవారు:3,76,77,328
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 22,35,267 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,63,84,39,207కు చేరింది.
అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 35,22,726 మందికి కరోనా సోకింది. 10,652 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 36,29,39,500కి చేరగా.. మరణాల సంఖ్య 56,45,188కు పెరిగింది.
- అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా5,33,313 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 3,143 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7.4 కోట్లు దాటింది.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 4,28,008 కేసులు వెలుగుచూశాయి. మరో 258 మంది చనిపోయారు.
- ఇటలీలో 1,67,206 కొత్త కేసులు బయటపడగా.. 362 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 2,19,878 మందికి వైరస్ సోకగా.. 606 మంది చనిపోయారు.
- అర్జెంటీనాలో తాజాగా 88,503 కరోనా కేసులు బయటపడగా.. 316 మంది బలయ్యారు.
- జర్మనీలో 1,88,759 వేల మందికి వైరస్ సోకింది. మరో 184మంది మృతి చెందారు.
- బ్రిటన్‌లో మరో 1,02,292 వేల మంది వైరస్ బారిన పడ్డారు. 346 మంది మృతి చెందారు.
- స్పెయిన్‌లో తాజాగా 1,33,553 కేసులు బయటపడ్డాయి. మరో 215 మంది మరణించారు.
ఇదీ చదవండి:ICMR on Omicron: డెల్టానూ అడ్డుకునే ఒమిక్రాన్ రోగ నిరోధకత