భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య (Corona Update) కాస్త తగ్గింది. కొత్తగా 42,618 మంది వైరస్(Covid-19) బారినపడ్డారు. మరో 330 మంది మరణించారు. ఒక్కరోజే 36,385 మంది కరోనాను జయించారు.
- మొత్తం కేసులు:3,29,45,907
- మొత్తం మరణాలు:4,40,225
- మొత్తం కోలుకున్నవారు:3,21,00,001
- యాక్టివ్ కేసులు:4,05,681
వ్యాక్సినేషన్
శుక్రవారం ఒక్కరోజే 58,85,687 కొవిడ్ టీకా (Vaccination in India) డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ(Health Ministry) పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 67,72,11,205 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
ప్రపంచ దేశాల్లో..
ప్రపంచవ్యాప్తంగా కరోనా(Global corona virus update) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 663,107 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 9,827 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 220,595,328కు చేరగా.. మరణాల సంఖ్య 4,566,224కు పెరిగింది.
కొత్త కేసులు ఇలా..
- అమెరికా- 182,593
- బ్రెజిల్- 25,348
- రష్యా- 18,856
- బ్రిటన్- 42,076
- ఫ్రాన్స్- 18,856
- టర్కీ-22,857
- ఇరాన్-27,621
- మెక్సికో-18,138
ఇవీ చదవండి:covid variant mu: భారత్‌లో 'మ్యూ' భయాలు- కొత్త వైరస్ ప్రమాదకరమా?
Covid 19 r value: మళ్లీ పెరిగిన ఆర్-ఫ్యాక్టర్.. థర్డ్‌వేవ్ తప్పదా?