India Corona cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కొత్తగా 2,685 కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా మరో 33 మంత్రి ప్రాణాలు విడిచారు. మరో 2,158 మంది కోలుకున్నారు.
- మొత్తం కరోనా కేసులు: 4,31,50,262
- మొత్తం మరణాలు: 5,24,572
- యాక్టివ్ కేసులు: 16,308
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,09,335
Vaccination India: దేశవ్యాప్తంగా శుక్రవారం 14,39,466 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,93,13,41,918కు చేరింది. ఒక్కరోజే మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. క్రితం రోజుతో పోల్చితే మాత్రం స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 544,985 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,330 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 53,07,84,186కు చేరింది. మరణాల సంఖ్య 63,09,502కు చేరింది. ఒక్కరోజే 6,23,366 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 50,13,14,077గా ఉంది.
- అమెరికాలో కొత్తగా 98,249 కేసులు నమోదయ్యాయి. 263 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 40,633 కేసులు బయటపడ్డాయి. వైరస్ ధాటికి 117 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో తాజాగా 38,954 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 39 మంది మృతిచెందారు.
- జర్మనీలో 14,483 కేసులు వెలుగుచూశాయి. 17 మంది చనిపోయారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 4,811 కేసులు నమోదయ్యాయి. మరో 45 మంది మృతిచెందారు.
ఉత్తరకొరియాలో లక్షకుపైగా: ఉత్తరకొరియాలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గింది. కొత్తగా 88,530 కేసులు వెలుగు చూశాయి. ఒక్కరు కూడా చనిపోలేదు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33,59,380 కి చేరింది. మరణాల సంఖ్య 69గానే ఉంది. వైరస్ బారినపడిన వారిలో 31,56,310 మంది కోలుకున్నారు.
ఇదీ చదవండి:'హాలీవుడ్' స్టైల్లో లగ్జరీ కార్లు చోరీ.. ఒక్కనెల్లోనే 40.. ఎలా దొరికారంటే?