భారత్, చైనా మధ్య నేడు (శనివారం) సీనియర్ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద చెలరేగిన వివాదాల పరిష్కారానికి జరుగుతున్న పదో విడత చర్చలు కావడం గమనార్హం. శనివారం ఉదయం 10 గంటలకు చైనా భూభాగంలోని మాల్దో పోస్టు వద్ద ఈ సమావేశం జరగనుంది.
తూర్పు లద్దాఖ్‌లోని గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్, దెప్సాంగ్ ప్రాంతాల్లో సైనిక బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు ప్రధానంగా చర్చించనున్నాయి. భారత్ తరఫున లేహ్‌లోని 14వ క్రాప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్, చైనా తరఫున దక్షిణ షింగ్యాంగ్ మిలటరీ డిస్ట్రిక్ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ పాల్గొంటారు.