తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభనపై భారత్ చైనాల మధ్య శనివారం సుదీర్ఘ చర్చలు జరిగాయి. చైనా సరిహద్దులోని మోల్డో ప్రాంతంలో కోర్ కమాండర్ స్థాయి అధికారుల మధ్య ఈ చర్చలు 9 గంటల పాటు జరిగినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10.30కు ప్రారంభమైన భేటీ.. రాత్రి 7.30కు ముగిసింది. తూర్పు లద్ధాఖ్లోని హాట్‌స్ప్రింగ్, గోగ్రా తదితర ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
భారత్-చైనా మధ్య 9 గంటల పాటు చర్చలు - భారత్ చైనా సరిహద్దు వివాదం
సరిహద్దు వివాదంపై భారత్ చైనాల మధ్య శనివారం 12వ విడత చర్చలు జరిగాయి. ప్రతిష్టంభనపై ఇరు వర్గాలు 9 గంటల పాటు చర్చించుకున్నట్లు సమాచారం.
భారత్-చైనా మధ్య 9 గంటల పాటు చర్చలు
భారత్, చైనా మధ్య ఏడాది నుంచి సరిహద్దు వివాదం సాగుతున్నా విస్తృత స్ధాయి చర్చల తర్వాత పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి ఇరుదేశాలు బలగాలను ఉపసంహరించుకున్నాయి. ఇప్పటివరకు 11 సార్లు కోర్ కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగాయి.
ఇదీ చదవండి :'భగత్‌సింగ్' నాటకంలో బాలుడికి నిజంగా ఉరి!