తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో కొత్తగా 13,550 కరోనా కేసులు - కొవిడ్​ వార్తలు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కేరళలో కొత్తగా 13,550 కేసులు నమోదవగా.. మహారాష్ట్రలోనూ 8 వేల పైగా కేసులు బయటపడ్డాయి. తమిళనాడు, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో కొవిడ్​ బాధితులు తగ్గుతున్నారు.

india cases
కరోనా కేసులు

By

Published : Jun 29, 2021, 11:21 PM IST

భారత్​లో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. కేరళలో కొత్తగా 13,550 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. 11,529 మంది కోలుకోగా, 104 మంది ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో కొత్తగా 8,085 కేసులు బయటపడ్డాయి. 8,623 మంది డిశ్చార్జ్​ కాగా, 231 మంది ప్రాణాలు కోల్పోయారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • తమిళనాడులో కొత్తగా 4,512 కేసులు నమోదయ్యాయి. 6,013 మంది కోలుకోగా, 118 మంది మృతిచెందారు.
  • కర్ణాటకలో కొత్తగా 3,222 కేసులు నమోదు కాగా.. 14,724 మంది డిశ్చార్జి అయ్యారు. 93 మంది మృతిచెందారు.
  • దేశ రాజధాని దిల్లోలో 101 కేసులు బయటపడ్డాయి. నలుగురు మృతి చెందారు.
  • గుజరాత్​లో వరుసగా రెండో రోజు 100కు తక్కువ రోజువారీ కేసులు నమోదయ్యాయి. తాజాగా 93 కేసులు వెలుగుచూశాయి.

ఇదీ చదవండి:11 నెలల తర్వాతే వ్యాక్సిన్​​ రెండో డోసు!

ABOUT THE AUTHOR

...view details