తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆన్‌లైన్‌ విద్యకు ప్రపంచ రాజధానిగా భారత్‌'

ఆన్‌లైన్‌ విద్యలో భారత్‌ ప్రపంచ రాజధానిగా అవతరించే అవకాశం ఉందని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ అన్నారు. ఈ రంగంలో ప్రైవేటు పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Online education in India
భారత్​లో ఆన్​లైన్​ విద్య

By

Published : Oct 22, 2021, 7:20 PM IST

ఆన్‌లైన్‌ విద్యలో భారత్‌ ప్రపంచ రాజధానిగా అవతరించే అవకాశం ఉందని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ అన్నారు. ఈ రంగంలో ప్రైవేటు పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తుండగా.. ప్రభుత్వం అందుకు కావాల్సిన సహకారం అందజేస్తోందన్నారు. 'పబ్లిక్ అఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా(పీఏఎఫ్‌ఐ)' వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎడ్యుటెక్ రంగంలో సాంకేతికతను మరింత సమర్థంగా అందిపుచ్చుకోగలిగితే.. భారత్‌ ఉన్నత శిఖరాలకు చేరుతుందని అమితాబ్‌ కాంత్‌ అంచనా వేశారు. అందుబాటు ధరలో ఇంటర్నెట్‌ సౌకర్యం, సాంకేతికతో కూడిన మౌలిక వసతులే ఈ రంగాభివృద్ధికి కీలక సాధనాలని తెలిపారు. ఈ క్రమంలో అణగారిన వర్గాలకు కూడా విద్యా ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు. భారత్‌లో ఎడ్యుటెక్‌ వల్ల విద్యార్థులు విద్యనభ్యసించడంతో పాటు.. విషయ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు అందుతాయని ఇదే కార్యక్రమంలో మాట్లాడిన ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ బైజూస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ రవిచంద్రన్‌ అన్నారు.

ఇదీ చూడండి:DRDO Abhyas test: 'అభ్యాస్' పరీక్ష విజయవంతం​

ABOUT THE AUTHOR

...view details