గతేడాది కరోనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం వైరస్ను ఎదుర్కోవడంలో భారత్ భౌతికంగా, మానసికంగా పరిణితి సాధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్లోని 13చోట్ల రక్తదాన శిబిరాలను వర్చువల్గా ప్రారభిస్తూ హర్షవర్ధన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొవిడ్ కారణంగా రక్తం కొరత తీర్చడానికి కంపీటెంట్ ఫౌండేషన్, ఇతర స్వచ్ఛంద సంస్థల సాయంతో రక్తదాన శిబిరాల్ని ఏర్పాటు చేస్తోంది.