సరిహద్దులో మోహరించిన బలగాల ఉపసంహరణ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా భారత్, చైనా మధ్య పదో విడత సైనిక చర్చలు సాగాయి. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఆ ప్రక్రియ ముగిసినందున.. తూర్పు లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, దెప్సాంగ్ నుంచీ ఉపసంహరించుకోవాలని భారత్ నొక్కి చెప్పినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
చైనా భూభాగంలోని మాల్దో పోస్టు వద్ద శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన చర్చలు.. ఆర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగాయి. కార్ఫ్స్ కమాండర్ స్థాయిలో ఈ భేటీ జరిగింది.